E-Paper
Advertisement

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయ్

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయ్
Advertisement

Four Door Refrigerators: ఈ రోజుల్లో ఉద్యోగాలు, బిజీ లైఫ్‌స్టైల్ వల్ల చాలా మంది ప్రతి రోజూ మార్కెట్‌కు వెళ్లకుండా.. వారానికి లేదా నెలకు సరి పడా కూరగాయలు, పండ్లు, గ్రాసరీస్‌ను ఒకే సారి బల్క్‌గా కొనేస్తుంటారు. అయితే.. అలా తెచ్చిన సరుకులు పాడవకుండా, ఫ్రెష్‌గా దాచుకోవడమే అసలైన సవాలు. సాధారణ రెండు డోర్ల ఫ్రిడ్జ్‌లలో స్థలం సరి పోక సర్దడం కష్టమవుతుంది. ఇలాంటి హెవీ స్టోరేజ్ అవసరాలు ఉన్న పెద్ద కుటుంబాలకు, మోడరన్ కిచెన్ లుక్ కోరుకునే.. వారికి ఫోర్ డోర్ రెఫ్రిజిరేటర్లు ఒక పర్ఫెక్ట్ సోల్యూషన్. వీటిలో ఉండే షెల్ఫ్‌లు, ఫ్లెక్సిబుల్ జోన్స్ వల్ల ఏ వస్తువునైనా చాలా ఈజీగా సర్దుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్లో లభిస్తున్న టాప్ 5 ఫోర్ డోర్ ఫ్రిడ్జ్‌ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 ఫోర్ డోర్ ఫ్రిడ్జ్‌లు

1. Samsung 580L Refrigerator

ఈ లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది ఈ మోడల్ గురించే. బల్క్ గ్రాసరీస్ కొనేవారికి ఇది ఒక డ్రీమ్ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న ‘కన్వర్టిబుల్ ఫ్రీజర్’ ఆప్షన్ వల్ల, మీకు అవసరమైనప్పుడు ఫ్రీజర్ స్పేస్‌ను సాధారణ ఫ్రిడ్జ్ స్థలంగా మార్చుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ కూరగాయలు లేదా మిగిలిపోయిన ఆహారాన్ని ఈజీగా దాచుకోవచ్చు. ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ వల్ల ఫ్రిడ్జ్, ఫ్రీజర్ భాగాల్లో తేమ శాతం సరిగ్గా ఉండి, పండ్లు, ఆకుకూరలు దాదాపు రెండు వారాల పాటు ఫార్మ్ ఫ్రెష్‌గా ఉంటాయి. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల కరెంట్ ఆదా అవ్వడమే కాకుండా సౌండ్ కూడా రాదు.

2. LG 655L Frost Free Refrigerator:

Advertisement

ప్రీమియం మోడల్ ఇది. ఎక్కువ స్టోరేజ్ కోరుకునే పెద్ద కుటుంబాలకు ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇందులో.. ఉన్న ‘డోర్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ ఫ్రిడ్జ్ మూలమూలలకూ సమానంగా చల్లదనాన్ని అందిస్తుంది, దీని వల్ల డోర్ బాస్కెట్లలో పెట్టిన పాలు, వాటర్ బాటిళ్లు కూడా వేగంగా కూల్ అవుతాయి. స్మార్ట్ డయాగ్నోసిస్, ఇన్వర్టర్ లీనియర్ కంప్రెసర్ దీనికి మెయిన్ అట్రాక్షన్. గ్లాస్ షెల్ఫ్‌లు చాలా బలంగా ఉండటం వల్ల పెద్ద పెద్ద పాత్రలు, భారీ ఫ్రూట్ బాస్కెట్లు పెట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

3. Haier 531L Refrigerator:

ఇక బడ్జెట్ , టెక్నాలజీ కాంబినేషన్‌లో నిలిచేది ఈ మోడల్. ఈ ఫ్రిడ్జ్ డిజైన్ చాలా ట్రెండీగా, మోడరన్ కిచెన్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఇందులో 83% కంటే ఎక్కువ ఫ్రిడ్జ్ స్పేస్ లభిస్తుంది. నాన్-ఫోర్మోసిస్ స్మార్ట్ డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ వల్ల చెడు వాసన రాకుండా, గాలి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. పండ్లు, కూరగాయలకు ప్రత్యేకంగా తేమను నియంత్రించే ‘హ్యూమిడిటీ జోన్’ ఇందులో ఉంది. తక్కువ కరెంట్ ఖర్చుతో పవర్‌ఫుల్ కూలింగ్ ఇచ్చే ఈ ఫ్రిడ్జ్, మీ బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఫోర్ డోర్ ఆప్షన్.

4. Whirlpool 570L Refrigerator

Advertisement

లేటెస్ట్ ఫీచర్లతో అలరించే మరో అద్భుతమైన మోడల్ ఇది. ఇందులో.. ఉన్న ‘ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ’ వాతావరణ ఉష్ణోగ్రత ,లోపల ఉన్న గ్రాసరీస్ బరువును బట్టి కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల కరెంట్ బిల్లు చాలా ఆదా అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చీజ్, సీజనల్ ఫ్రూట్స్ దాచడానికి ప్రత్యేకమైన ఫ్లెక్సి-జోన్స్ ఇందులో ఉన్నాయి. మేట్రిక్స్ లైటింగ్, ప్రీమియం స్టీల్ ఫినిషింగ్ మీ వంటగదికి ఒక రాయల్ లుక్‌ను అందిస్తాయి.

Also Read: జేబులో పట్టేంత కాంపాక్ట్ డిజైన్! ఫీచర్లు చూస్తే ఫిదా

5.Bosch 600L Refrigerator

చివరిగా జర్మన్ టెక్నాలజీతో వచ్చే ఈ మోడల్ చాలా రిచ్ లుక్ కలిగి ఉంటుంది. క్వాలిటీకి బాష్ బ్రాండ్ పేరుగాంచింది. ఇందులోని ‘విటాఫ్రెష్ ప్రో’ సిస్టమ్ ఆహార పదార్థాల్లోని విటమిన్లు, తేమ పోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచుతుంది. దీనిలోని ఎయిర్ ఫ్లో ప్యానెల్స్ వల్ల బాక్టీరియా చేరకుండా చల్లని గాలి ప్రసరిస్తుంది.

వారానికి సరిపడా హెవీ గ్రాసరీస్ కొనే కుటుంబాలకు ఈ ఐదు ఫోర్ డోర్ రిఫ్రిజిరేటర్లు అమెజాన్ లో మంచి డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి తగ్గ మోడల్‌ను ఎంచుకుని స్టోరేజ్ టెన్షన్‌కు చెక్ పెట్టేయండి!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×