E-Paper
Advertisement

దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్.. మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చిన స్టూడెంట్, తెలంగాణలో ఘటన

దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్.. మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చిన స్టూడెంట్,  తెలంగాణలో ఘటన
Advertisement

NEET PG -2026 Exam: దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ-2026 పరీక్ష జరిగింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్దతిలో ఈ పరీక్ష జరిగింది. పరీక్ష ఉదయం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోపలికి ఉదయం 7 గంటల నుంచి లోనికి అనుమతించారు. అదే సమయంలో మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చాడు ఓ విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది.

 

దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్

Advertisement

దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ-2026 ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష జరిగింది. 1300 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌-సీబీటీ విధానంలో ఈ పరీక్ష జరిగింది. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం ఎగ్జామ్ కావడంతో విద్యార్థులను 7 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

రంగారెడ్డి జిల్లా శేరిగూడ కేంద్రం వద్ద కలకలం రేపింది. పరీక్ష సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని పరీక్షా కేంద్రానికి ఓ వైద్య విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. గేటు వద్ద సెక్యూరిటీ, అధికారులు తనిఖీలు చేపట్టారు. సదరు అభ్యర్థి మద్యం మత్తులో తూలుతూ ఉండటాన్ని గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించకుండా అధికారులు వెనక్కి పంపించి వేశారు.

Advertisement

 

తెలంగాణలో మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చిన  స్టూడెంట్

కీలకమైన మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ఓ విద్యార్థి ఇలా మద్యం సేవించి రావడం తోటి అభ్యర్థులు, అధికారులు షాక్ కు గురయ్యారు. 7 గంటల నుంచి విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరిగింది. గుర్తింపు కార్డుల పరిశీలన తర్వాత పరీక్షా కేంద్రంలోని తరలించారు. ఉదయం 8.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసి వేశారు అధికారులు.

చాలామంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ వారిని అనుమతించలేదు. హాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకుండా దూరంగా పెట్టారు. పరీక్షా కేంద్రాల సమీపంలో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వేలాది మంది విద్యార్థుల వెంట వారి వెంట తల్లిదండ్రులు రావడంతో వాహనాలతో రోడ్లు బిజీగా మారాయి.

ALSO READ: టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ.. సొంతగడ్డపై బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

దీనికితోడు హైదరాబాద్ లో మారథాన్ ఉండడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అటు ఏపీలో కూడా ఈ పరీక్ష ప్రశాంతంగా సాగింది.

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×