E-Paper
Advertisement

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?
Advertisement

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అప‌రిప‌క్వ సంభాషణ ఫ‌లితంగా ఆర్కే నుంచి సుభాషితం వినాల్సి వ‌చ్చింది. కోమ‌టిరెడ్డివి పిల్ల చేష్ట‌లంటూనే తనూ ఏం త‌క్కువ తినలేద‌నించుకున్నాడు ఆర్కే. కుప్పిగంతులే వేశాడు. నీ ర‌హ‌స్యాల‌న్నీ ఇవీ.. అని వాటిని బ‌య‌ట‌పెట్ట‌లేదు క‌దా.. అంటూనే బ‌య‌ట‌పెట్టి త‌న గ‌డుసు త‌నం చాటుకునే క్ర‌మంలో రాజ‌గోపాల్‌రెడ్డి కంటే మ‌రీ దిగ‌జారిపోయి ఉత్త ప‌లుకులు ప‌ల‌కాల్సి వ‌చ్చింది.

మ‌రి త‌న‌ను రెచ్చ‌గొడితే అంతమాత్రం బెదిరింపైనా లేక‌పోతే అర్థం లేదు. స‌రే, రాజ‌గోపాల్ ముచ్చ‌ట గురించి పెద్ద‌గా చెప్పుకోవ‌డం కూడా టైం వేస్ట్ వ్య‌వ‌హార‌మే అవుతుంది. మ‌నమూ పిల్ల చేష్ట‌ల‌కే పోవాల్సి వ‌స్తుంది.. ఆర్కేలాగా. అయితే ఈ ఉదంతంలో అనివార్యంగా సీఎం రేవంత్‌రెడ్డి గురించి, స‌ర్కార్ తీరు గురించి, ఎమ్మెల్యేల క‌ప్ప‌దాటు చ‌ర్య‌ల గురించి.. కూడా ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది.

Advertisement

దొరికింది మోఖా అని త‌న‌లోని బాధ‌, అసంతృప్తి, అక్క‌సు, అసంతృప్తి, అస‌హ‌నం.. అన్నీ ప్ర‌ద‌ర్శించి త‌న‌కు స‌హ‌జంగా అల‌వాటైన దోర‌ణిలో బెదిరింపు వ్యాఖ్య‌ల‌ను అంత‌ర్లీనంగా జొప్పించి హితోక్తుల నీతిబోధ‌ల ప్ర‌వ‌చ‌నాల‌ను ప్ర‌వ‌చించాడు. రేవంత్ వ‌ల్లే అధికారం వ‌చ్చింద‌న్నాడు. కానీ స‌ర్కార్ ఏర్ప‌డ‌గానే కాదు క‌దా.. దాన్ని నిల‌బెట్టుకోవ‌డం కూడా తెలిసి ఉండాల‌ని అన‌డం.. రేవంత్ అస‌మ‌ర్థుడ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

ఇక్క‌డో ముచ్చ‌ట చెప్పుకోవాలి. కేసీఆర్ కూడా అచ్చం ఇలాగే చేశాడు ఆర్కే విష‌యంలో. అధికారంలోకి రాక‌ముందు రారా పోరా అనే ఇద్ద‌రి స్నేహం బెడిసికొట్టింది అధికారం త‌రువాత కేసీఆర్ మార‌డంతోనే. సీఎం అయిన త‌రువాత లైట్ తీసుకున్నాడు ఆర్కేను. అక్క‌డే మండి ఉంటుంది. అందుకే అక్ష‌రాలా.. అక్ష‌రాల ఎదురుదాడి జ‌రిగింది.

Advertisement

ప‌త్రిక ఆఫీసు త‌గ‌ల‌బ‌డితే వ‌చ్చి ప‌రామ‌ర్శించినా.. ప్ర‌తిగా విలువైన భూమి బ‌హుమానంగా ఇచ్చినా సాటిఫై కాలేదు అత‌గాడు. ఇంకా ఏదో కావాలి. కీర్తించాలి. చెప్పింది వినాలి. సాగిల‌బ‌డాలి. అవి జ‌ర‌గ‌న‌ప్పుడు, ఈగో హ‌ర్ట‌యిన‌ప్పుడు.. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ విష‌యంలో కూడా అదే జ‌రుగుతోంది.

రేవంత్ కూడా చాలా మారిపోయాడు. అదంతే.. అధికారం మార్చేస్తుంది. సీఎం పీఠం ఎక్క‌గానే ఆటోమెటిక్‌గా అలా అయిపోతారెందుకో.. తెలియదు. వారికే అడ‌గాలి. ఆర్కే .. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ తీరు గురించి చెప్పిందంతా నిజ‌మే. కానీ దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పాడు. అస‌లు ప్ర‌భుత్వ‌మే ఉంటుందా? అన‌డం ఓ ర‌క‌మైన బెదిరింపే.

ఈ వ్యాఖ్య‌ల ద్వారా త‌న మ‌న‌సులో రేవంత్ మీద ఉన్న క‌సి అంతా బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్టే అనిపించింది. ఎక్క‌డో చెడింది శీనా? అన్న‌ట్టుగానే ఉంది. మిత్రుడ‌నే కానీ.. నువ్వు ఆ స్నేహానికి విలువ ఇచ్చినంత వ‌ర‌కే అనే సందేశం ఉంది ఇందులో. మ‌రి ఆ విలువ ఏమిటీ? అంటే .. ఏదైనా కావొచ్చు. విలువైనవే కావొచ్చు. రేవంత్ విన‌క‌పోయీ ఉండొచ్చు.

త‌న‌కంటూ ఓ టీమ్ లేక‌పోతే కాంగ్రెస్‌లో క‌ష్ట‌మే. ఓ వైపు భ‌ట్టి, మ‌రో వైపు ఉత్త‌మ్.. సీఎం సీటు కోసం ఆశ‌గా ఎదురు చూసే వాళ్లే త‌ప్ప‌.. ప్రాక్టిక‌ల్‌గా తాము ఒంటి చేత్తో స‌ర్కార్‌ను తేగ‌లుగుతామా? అని ఆలోచిస్తే.. అది ఎప్ప‌టికీ కాదని, అధికారం రాద‌ని వారికీ తెలుసు. ఇప్పుడు వ‌చ్చిన అధికారాన్నే క‌రెక్టుగా వినియోగించుకోక‌.. ఆధిప‌త్యాల‌కు పోయి.. పీఠం కోసం పాకులాడి.. ప‌క్క‌లో బ‌ల్లెంలా మారి.. ఉన్న స‌ర్కార్‌ను చేజేతులా కుప్ప‌కూల్చేందుకు వీరు చాలు. ప్ర‌తిప‌క్షాలు అక్క‌ర‌లేదు.

పీఠ‌మెక్క‌గానే.. దీనికి తానే కార‌కుడ‌న‌ని, పార్టీలో అంతా కీర్తిస్తార‌ని, జ‌పిస్తార‌ని అనుకోవ‌డం రేవంత్ భ్ర‌మ. ఓ కేసీఆర్ అనుభ‌వ‌మే క‌ళ్ల‌ముందు తారాడుతుండ‌గా.. అదే తోవ‌లో న‌డుస్తూ… తెలిసి తెలిసి గోతిలో ప‌డేందుకు రేవంత్ స‌ర్కార్ రెడీగా ఉంద‌నే విష‌యం మాత్రం ఆర్కే మాట‌ల ప‌ర‌మార్థంగా క‌చ్చితంగా చూడాలి.

Tags

Related News

సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా హెచ్చరికలతో జంకుతున్న నేపాల్!

నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ!

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..! వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

Big Stories

Advertisement
×