E-Paper
Advertisement

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?
Advertisement

Tollywood Young Hero: ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలకు.. లైఫ్ లో  ఈ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనే ఒక ఆశ ఉంటుంది. అలా  హీరోలు ఆశపడే డైరెక్టర్స్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకడు. అప్పట్లో పూరీ సినిమాలు అంటే ఒక బ్రాండ్.  సాధారణంగా హీరోలు అంటే చదువుకోవాలి.. నీట్ గా ఉండాలి.. బూతులు మాట్లాడకుడు.. ఆవేశపడకూడదు.. అన్నింటికి సైలెంట్ గా ఉండాలి.. ఎన్నో ఏళ్లుగా హీరోలను అలానే చూపిస్తూ వచ్చారు.

కానీ పూరీ  హీరోలు మాత్రం వీటికి విరుద్ధం.. పూరీ  సినిమాలో హీరోలు పోకిరీలు, బేవార్స్ లు.. అమ్మాయిల వెంట పడేవాళ్లు.. బూతులు మాట్లాడతారు. అసలు ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని హీరోలుగా ప్రేక్షకులు ఒప్పుకుంటారా.. ? అంటే..  వారిని కన్విన్స్ చేసేవిధంగా పూరీ చెప్పే కథ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.  బద్రి, పోకిరీ, చిరుత, బిజినెస్ మ్యాన్, టెంపర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి  పూరీ  ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. డైరెక్టర్ గా కంటే పూరీ  వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Advertisement

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

డైరెక్టర్ అవ్వాలనే ఆశ చచ్చిపోకూడదని.. చేతిలో చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే.. ఆ తపన పోయి ఎక్కడ తన ఆశయాన్ని వదిలి జాబ్ లో సెటిల్ అవుతానేమో అనుకోని.. సర్టిఫికెట్స్ మొత్తాన్ని కాల్చి డైరెక్టర్ అయ్యాడు పూరీ. ఎప్పుడు రియాలిటీలో బతుకుతాడు. సినిమా హిట్ అయినప్పుడు ఎగిరిపడడు.. ప్లాప్ అయినప్పుడు కుంగిపోడు. ఇలాంటి డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ ఎంతోమంది హీరోలు ఎదురుచూసేవాళ్లు. కానీ, ప్రస్తుతం పూరీ ప్లాపుల మధ్య నడుస్తున్నాడు. అందుకే సీనియర్ హీరోలు కూడా ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే పూరీ.. ఒక కుర్ర హీరోకు కథ వినిపించాడని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ హీరో ఎవరో కాదు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లు హిట్ తో సిద్దు జాతకం మొత్తం మారిపోయింది. వరుస సినిమాలు.. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా నాలుగు సినిమాలు ఇప్పుడు సిద్దు చేతిలో ఉన్నాయి.

ఇక పూరీ తాజాగా సిద్దు కోసం కథను రాసి తీసుకెళ్లగా.. టిల్లు రిజెక్ట్ చేశాడని టాక్ నడుస్తోంది. అయితే సిద్దు కథ నచ్చక రిజెక్ట్ చేశాడా.. ? లేక  పూరీ ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అని రిజెక్ట్ చేశాడా.. ? లేక చేతిలో ఎక్కువ సినిమాలు ఉన్నాయని వద్దు అన్నాడా.. ? అనేది తెలియదు కానీ, సిద్దు రిజెక్ట్ చేసి పెద్ద తప్పే చేశాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

పూరీ ప్లాపుల్లో ఉన్నాడు.. అతడి పని అయిపోయింది అని ఇండస్ట్రీ అన్న ప్రతిసారి అతడు తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. అందులోనూ ఒక క్లాస్ హీరోను మాస్ హీరోగా చూపించడంలో పూరీ తరువాతనే ఎవరైనా. రొమాంటిక్ హీరోగా ఉన్న రామ్ ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన ఘనత పూరీదే. ప్రస్తుతం టిల్లు చేసే సినిమాలన్నీ క్లాస్ సినిమాలే.

జాక్, తెలుసు కదా, టిల్లు క్యూబ్.. ఇక ఇవి కాకుండా కోహినూర్ లాంటి పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. కథ నచ్చక రిజెక్ట్ చేస్తే పర్లేదు కానీ, ఒకవేళ ప్లాపుల మధ్యలో ఉన్న డైరెక్టర్, రిస్క్ ఎందుకు అని నో చెప్తే మాత్రం.. సిద్దు ఒక మాస్ సినిమాను పోగొట్టుకున్నట్లే అని చెప్పుకొస్తున్నారు. ఇక సిద్దు ఆ కథను రిజెక్ట్ చేయడంతో.. పూరీ మరో కుర్ర హీరో వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పూరీ కమ్ బ్యాక్ ఇస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×