Big Stories

Navik Rocket : ఇస్రో ఖాతాలో మరో మైలురాయి.. నేవిక్ రాకెట్ లాంచ్ సక్సెస్..

Navik Rocket : ఇస్రో ఇప్పటివరకు ఎన్నో ల్యాండ్‌మార్క్ విజయాలను సాధించింది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇస్రో వైపు తిరిగే చూసేలా చేశాయి వీరి ప్రయోగాలు. వీరి ప్రయోగాలు ఎన్నో ఇతర స్పేస్ స్టేషన్స్‌కు ల్యాండ్‌మార్క్‌గా మారాయి. తాజాగా నింగిలోకి మరో ల్యాండ్‌మార్క్ శాటిలైట్‌ను పంపింది ఇస్రో. ఈ శాటిలైట్ ఘనవిజయాన్ని ఛైర్మన్ ఎస్ సోమనాథ్ స్వయంగా అందరితో పంచుకున్నారు. ఈ ప్రయోగంలో భాగమయిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఇప్పటివరకు ఎన్నో అత్యాధునికమైన శాటిలైట్స్‌ను నింగిలోకి పంపింది ఇస్రో. ఈసారి అంతరిక్షంలోకి ఎగిరింది కూడా అలాంటి ఒక అత్యాధునికమైన శాటిలైటే అని నిపుణులు చెప్తున్నారు. సోమవారం ఉదయం 10.42 నిమిషాలకు శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుండి ఈ రాకెట్ అంతరిక్షంలోకి ఎగిరింది. ఎఫ్ 12, ఎన్వీఎస్ 1 లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ రాకెట్ అంతరిక్షానికి చేరుకుంది. నేవిషన్ విత్ ఇండియన్ కాన్స్టల్లేషన్ (నేవిక్) సర్వీసులను మెరుగుపర్చడానికి ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలుస్తోంది.

- Advertisement -

నేవిక్ లాంటి ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పనిలో ఉన్న ప్రాజెక్ట్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) తరహాలోనే ఇది కూడా పనిచేస్తుందని ఇస్రో ఉద్యోగులు చెప్తున్నారు. నేవిక్ అనేది శాటిలైట్, ఎయిర్ వే, సీ వే, లొకేషన్, పర్సనల్ మొబిలిటీ.. ఇలా పలు సేవలను మెరుగుపరచడానికి ఉపయోడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సర్వేయింగ్, జియోడెసీ, శాస్త్రీయ పరిశోధన, సింక్రనైజేషన్, భద్రత-ఆఫ్-లైఫ్ అలర్ట్ వంటి విషయాల్లో నేవిక్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇస్రో నిర్ణయించుకుంది.

నేవిక్ ప్రయోగం అంతరిక్షంలోకి రాకెట్ సక్సెస్‌ఫుల్‌గా ఎగిరినప్పుడే పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యిందని ఛైర్మన్ ఎస్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. భూమి నుండి ప్రారంభమయిన 18 నిమిషాల తర్వాత నేవిక్ అనేది అంతరిక్షంలోకి చేరుకుందని తెలుస్తోంది. ఈ శాటిలైట్ యొక్క బరువు 2,232 కిలోలు అని ఇస్రో ఉద్యోగులు తెలిపారు. నేవిక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కొత్తలో ఇందులో చాలా కరెక్షన్స్ ఉండేవని, దానిని వెంటనే సరిచూసుకొని ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయానికి లాంచ్ చేశామని బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News