Apple Find My Feature : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ (Apple) ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ఈ మొబైల్స్ లో లేటెస్ట్ ఫీచర్స్ ను సైతం జోడిస్తుంది. తాజాగా యాపిల్ ఫైండ్ మై అప్డేట్ (Find My Update) ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. దీన్ని లాభాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
కస్టమర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లక్ష్యంగా ఎప్పటికప్పుడు మొబైల్స్ లో కొత్త అప్డేట్స్ ను తీసుకొస్తున్న ఆపిల్ కంపెనీ తాజాగా మరో అడుగు ముందుకేసి లేటెస్ట్ ఫీచర్స్ ను తీసుకొచ్చింది. తన కస్టమర్స్ కోసం ఫైండ్ మై అప్డేట్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో పోగొట్టుకున్న వస్తువులను తేలిగ్గా కనుగొనే అవకాశం ఉంటుంది. షేర్ ఐటమ్ లొకేషన్ ఆఫ్షన్ ఉండటంతో ఆపిల్ ఆ వస్తువు లొకేషన్ ను ట్రాక్ చేస్తుంది. ఇక పోయిన వెంటనే దానికి సంబంధించిన లింకును పంపటానికి మొబైల్ లో అనుమతిస్తుంది. దీంతో తేలికగా పోగొట్టుకున్న వస్తువును కనుగొనే అవకాశం ఉంటుంది. ఆపిల్ సెలెక్ట్ చేసిన కొన్ని ఫోన్స్ లో ఐవోఎస్ 18 అప్డేట్ ఫీచర్ ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఐఓఎస్ 8.2 డెవలపర్ అప్డేట్ తో మ్యాప్ కెనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పోగొట్టుకన్న వస్తువును ట్రాక్ చేసి ఐటమ్ కి నావిగేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మిస్ అయిన ఐటమ్ లొకేషన్ తెలుసుకోవడానికి ఎవరితోనైనా షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ తో మొదటగా వస్తువును కనుగొనే అవకాశం ఉంటుంది. ఎవరైనా దొంగలించినా వస్తువును ఇట్టే పసిగట్టే అవకాశం ఉంటుంది.
ALSO READ : విమానంలో వైఫైతో వాట్సాప్, యూట్యూబ్ వాడొచ్చా.. నిబంధనలు ఏంటి?
ఈ లొకేషన్ ను ట్రాక్ చేయడం వస్తువును కనుగొనే వరకూ జరుగుతూనే ఉంటుంది. వారం రోజులకు పైగా ఒక వస్తువు దొరకపోయినా దాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇక ఈ పోగొట్టుకున్న వస్తువును ఎంత మంది వెతుకుతున్నారో అనే విషయాన్ని ట్రాక్ చేయడానికి కూడా ఈ లింక్ ఉపయోగపడుతుంది. ఈ సమాచారాన్ని కావలసిన ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ కు అందిస్తుంది.
యాపిల్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ ఫీచర్ ప్రతీ ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడిక్కడ ప్రతీ వస్తువును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అవకాశం ఉన్న ప్రతీ వస్తువును ఫైండ్ మై అప్డేట్ ఫీచర్ తో లింక్ చేసుకుంటే పోగొట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫైండ్ మై డివైస్ (Find my device), ఫైండ్ మై లొకేషన్ (find my location), ఫైండ్ మై అప్డేట్ (find my update) వంటి ఫీచర్స్ ను తీసుకొచ్చాయి. తాజాగా యాపిల్ మరో అడుగు ముందుకేసి ఈ స్పెషల్ ఫీచర్ ను తీసుకొచ్చింది.