In flight Wi-Fi Services : విమాన ప్రయాణంలో ఉపయోగించే వైఫై సేవల్లో ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఫ్లైట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ రూల్స్ 2018 ప్రకారం విమానంలో వైఫై సేవలు ఉపయోగించుకోవాలంటే 3000 మీటర్ల కంటే ఎత్తుకు చేరాల్సిందే అంటూ నిబంధనలు జారీ చేసింది.
భారతీయ విమాన రంగంలో ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫ్లైట్లో ప్రయాణించే సమయంలో వైఫై ఉపయోగించుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి చేసింది. గగనతలంలో కనీసం ఎత్తుకు విమానం చేరినప్పటికీ వైఫై ఇంటర్నెట్ సేవలు అందించాలంటే ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల్ని విమానంలో ఉపయోగించడానికి సైతం అనుమతి ఉండాలని తెలిపింది. ఈ సమయంలో వాట్సప్, యూట్యూబ్ సైతం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
ALSO READ : నోట్ ప్యాడ్‌లో కొత్త AI ఆప్షన్.. ఎలాంటి టెక్ట్స్ ఇచ్చినా రీరైట్ చేసేస్తాదట, ఎలా పనిచేస్తుందంటే?
భూమితో అనుసంధానమై ఉన్న నెట్ వర్క్ కనెక్షన్స్ ను ఆపేస్తూ గగనతంలో ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. 2018 ఫ్లైట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ రూల్స్ లో స్వల్ప మార్పులు చేసింది. ఫ్లైట్ నిర్ధిష్ట ఎత్తుకు చేరాక మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెప్పుకొచ్చింది. ఈ నిబంధనలతో ఫ్లైట్లో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండానే భద్రతను మరింత పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. కమ్యూనికేషన్ వ్యవస్థలకు అవసరమైన భద్రతా ప్రమాణాలతో ఏమాత్రం రాజీ పడకుండా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తామని చెప్పుకొచ్చింది.
విమానాల్లో ఇప్పటివరకు 20 నిమిషాల ఫ్రీ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రయాణికుల అందరికీ అందుబాటులో ఉంది. దీంతో విమాన ప్రయాణ సమయంలో సైతం ప్రయాణికులు అవసరమైన కనెక్టివిటీని అందుకునే అవకాశాన్ని కల్పించేది. ఇక వైఫై ని పరిచయం చేసిన అనంతరం విస్తారా ప్రయాణికులకు వైఫై ప్లాన్స్ ను పొడిగించుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ప్లాన్స్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తూ వన్ టైం పాస్వర్డ్ ద్వారా ఈ వైఫైను పొందవచ్చని తెలిపింది.