Priyanka Ghandi: సోదాల పేరుతో మహిళలు ఉన్న గదుల్లోకి వెళతారా? అంటూ కేరళ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు ప్రవేశించడం సరికాదని అన్నారు. కేరళలోని వయనాడ్, పాలక్కాడ్ నియోజకవర్గాల్లో మరికొన్ని రోజుల్లో ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు పాలక్కాడ్ లో ఉంటున్నారు.
Also read: ఎట్టకేలకు అనుకున్నది సాధించిన అఘోరీ మాత.. ఈసారి పోలీసులే దగ్గరుండి మరీ?
అయితే ఓ కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్ తో లోపలికి వెళ్లారు. మహిళా కార్యకర్త అలా వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో బ్లాక్ మనీ తీసుకువెళుతున్నారనే ఆరోపణలతో విచారణ జరపాలని కేరళ సర్కార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హోటల్ కు వెళ్లి మహిళల గదుల్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ స్పందిచారు. సోదాల పేరుతో అర్దరాత్రి సమయంలో మహిళలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే వయనాడ్ లో ప్రియాంక గాంధీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో పాటు వయనాడ్ లో రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడంతో తప్పకుండా గెలుస్తామని ధీమాతో ఉన్నారు.