BigTV English

Tilak Varma: బ్యాటింగ్ చేస్తుండ‌గా పాక్ ప్లేయ‌ర్లు రెచ్చ‌గొట్టారు…స్లెడ్జింగ్ చేసి మ‌రీ !

Tilak Varma: బ్యాటింగ్ చేస్తుండ‌గా పాక్ ప్లేయ‌ర్లు రెచ్చ‌గొట్టారు…స్లెడ్జింగ్ చేసి మ‌రీ !

Tilak Varma:  ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది ఓసారి ఇప్పటికే ఛాంపియన్ అయిన టీమిండియా ఈసారి మరో టైటిల్ గెల్చుకుంది. దీంతో 9సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది టీమ్ ఇండియా. అయితే టీమిండియా… ఈ విజయం సాధించడానికి ముఖ్య కారణం టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ. అతడు గనుక మిడిల్ ఆర్డర్లో క్లిక్ కాకపోతే… టీమిండియా డేంజర్ జోన్ లో పడేది. అంతేకాదు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో యువరాజ్ సింగ్ తరహాలో తన పాత్రను టీమిండియా కు అందించాడు. అయితే ఇంతటి విజయం సాధించిన తిలక్ వర్మ… తాజాగా పాకిస్తాన్ ప్లేయర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో… పాకిస్తాన్ ప్లేయర్లు తనతో దారుణంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

తిలక్ వర్మపై స్లెడ్జింగ్ … పాకిస్తాన్ ప్లేయర్ల సరికొత్త కుట్ర

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఫైనల్ కావడంతో అందరి దృష్టిపడింది. అయితే టీమిండియా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో… బరిలోకి దిగిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రానించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు టీమిండియా కోసం కష్టపడుతున్న తిలక్ వర్మను… పాకిస్తాన్ బౌలర్లు అలాగే ఫీల్డర్లు… రెచ్చగొట్టే ప్రయత్నం చేశారట. ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తిలక్ వర్మ వెల్లడించారు.


పాకిస్తాన్ ప్లేయర్లు స్లెడ్జింగ్ పై తిలక్ వర్మ మాట్లాడుతూ…. తాను వచ్చేసరికి టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయిందని… అప్పుడు తీవ్రమైన ఒత్తిడి తనపై ఉందని వెల్లడించాడు తిలక్ వర్మ. కానీ ఆ సమయంలో నాకు భారతదేశం మాత్రమే గుర్తుకు వచ్చింది… పాకిస్తాన్ చేతిలో ఓటమి అస్సలు చెందకూడదని డిసైడ్ అయ్యానని తెలిపాడు. ప్రాణాలు ఇచ్చైన టీమ్ ఇండియన్ గెలపించాలని అనుకున్నా…. దానికోసమే కష్టపడ్డానని వివరించాడు. ఓడిపోతే భారతదేశం తక్కువ అవుతుందని నన్ను నేను బ్యాక్ చేసుకున్నానని తిలక్ వర్మ స్పష్టం చేశాడు. అయితే ఒత్తిడిలో ఉన్న తనను మరింత టార్గెట్ చేశారని పాకిస్తాన్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పాక్ బౌలర్లు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ… కాస్త ఓపిక పట్టానని తెలిపాడు. ఒకానొక సమయంలో స్లెడ్జింగ్ కూడా చేశారని ఫైర్ అయ్యాడు. అయినా ఇండియా కోసం ఓపిక పట్టుకొని మరి బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. నేను ఆడిన ఇన్నింగ్స్ లలో ఇదే అత్యుత్తమైనదని చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ. చివరి వరకు ఉండి… మ్యాచ్ గెలిపించాలని నేను అనుకున్న… అది చేసి చూపించానని తెలిపాడు. ఇండియాకు వరల్డ్ కప్ కూడా తెచ్చే జట్టులో తాను ఉండాలని నిత్యం కోరుకుంటానని తన డ్రీమ్ వెల్లడించాడు తిలక్ వర్మ.

Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే

 

Related News

RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?

Watch Video : పాక్ గ‌డ్డ‌పై జై హింద్ నినాదాలు.. అఫ్ఘానిస్తాన్ స్టూడెంట్స్ ర‌చ్చ రంబోలా..గూస్ బంప్స్ వీడియో

Ind vs Pak Toss: ఫైన‌ల్ లో టాస్ ఫిక్సింగ్‌..? షాకింగ్ వీడియో వైర‌ల్‌…పాక్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Arshdeep Singh : పాకిస్తాన్ అభిమానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అర్ష్ దీప్… వాడు ఏడవడం ఒక్కటే తక్కువ

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్… ఎప్పుడంటే ?

Asia Cup Trophy 2025: న‌ఖ్వీకి షాక్‌…అత‌ని చేతుల మీదుగా ట్రోఫీ అందుకోనున్న టీమిండియా

WI Vs NEP : ప్రమాదంలో వెస్టిండీస్.. టీ20 సిరీస్ గెలిచిన పసికూన నేపాల్..83 కే ఆలౌట్ చేసి మ‌రి

Big Stories

×