UPI ID: దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. టీ షాపు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు వినియోగదారులంతా డిజిటల్ ట్రాన్స్ యాక్షన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI చెల్లింపులకు ప్రాధాన్యం పెరిగింది. మోసాలు అదే రేంజ్‌లో పెరిగాయి కూడా. వీటి పరిష్కారం కోసం రక్షణ చర్యలు చేపట్టింది యూపీఐ. శుక్రవారం అంటే అక్టోబరు 2 నుంచి యూపీఐ చెల్లింపులకు కొత్త నిబంధనలను అమలు చేయనుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఆన్‌లైన్ లేదా డిజిటల్ ట్రాన్స్‌యాక్షన్లు పెరగడంతో ఫైనాన్స్ లావాదేవీల సంస్థలు అటువైపు దృష్టి పెట్టాయి. ఈ పద్దతిలో ప్రతి నెలా లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. మోసాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. యూపీఐ ఐడీలతో లింకైన వివరాలను బయట పెట్టేందుకు సైబర్ మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చర్యలు మొదలయ్యాయి.
సైబర్ నేరగాళ్లకు చెక్
ఇకపై యూపీఐ ఐడీలను ఈ-మెయిల్ తరహాలో రూపొందించే అవకాశాన్ని ఇస్తున్నాయి. అక్టోబరు 2 నుంచి యూపీఐ చెల్లింపులకు న్యూ రూల్స్ అప్లై కానున్నాయి. ఈ నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా యూపీఐ చెల్లింపుల సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
నార్మల్‌గా అయితే యూపీఐ ఐడీలు మొబైల్ నెంబరు ఆధారంగా ఉంటాయి. దీని స్థానంలో యూపీఐ ఐడీని అక్షరాలు, అంకెల రూపంలో మనకు నచ్చినట్లు రూపొందించుకోవచ్చు. అంటే ఈ-మెయిల్స్ తరహాలో అన్నమాట. దీనివల్ల ట్రాన్స్‌యాక్షన్ విషయంలో అవతలివారికి మొబైల్ నంబరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈజీగా చెల్లింపులు చేయొవచ్చు, అలాగే స్వీకరించవచ్చు.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటన్నది అసలు పాయింట్. మునుపటి మాదిరిగా మొబైల్ నంబరు లావాదేవీల్లో కనిపించదు. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. వ్యాపారులు తమ బ్రాండు పేర్లతో ఐడీలను రూపొందించుకోవచ్చు. ఈ-మెయిల్ మాదిరిగా వినియోగదారులు సులభంగా యూపీఐ ఐడీలను ఇతరులకు పంపించొచ్చు. దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి సంస్థలు ఈ తరహా మార్పులను అందుబాటులోకి తెచ్చాయి. యాప్‌ల సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొత్త ఐడీ సృష్టించుకోవచ్చు.
కొత్త ఐడీ ఎలా క్రియేట్ చేయాలి?
1. మీ ఫోన్‌లో Paytm యాప్ ఓపెన్ చేయండి.
2. ఎడమ వైపున ఉన్న మీ ప్రొఫైల్ చిహ్నానికి వెళ్లాలి.
3. UPI & చెల్లింపు సెట్టింగ్‌లకు క్రిందికి స్క్రోల్ చేయండి
4.ఇప్పుడు మీరు అన్ని UPI ఖాతా, ID వివరాలను కనిపిస్తాయి.
5.స్క్రీన్ పైభాగంలో మీరు ప్రస్తుత UPI IDని చూస్తారు
6.మీ ఖాతాకు లింక్ చేయబడిన అన్ని UPI IDలను చూడటానికి బటన్ నొక్కండి.
7. ఇప్పుడు అక్షరాలు-అంకెలతో కొత్త UPIని సృష్టించవచ్చు.
8. చెల్లింపు వైఫల్యాలను నివారించడానికి బ్యాకప్ UPI ID లను సృష్టించడానికి Paytm మిమ్మల్ని అనుమతిస్తుంది.