Affordable smart tvs: ప్రస్తుత రోజుల్లో.. ఎంటర్ టైన్మెంట్ అంటే.. కేవలం సినిమా హాల్స్‌కే పరిమితం కాలేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పుణ్యమా అని ఇంటినే మినీ థియేటర్‌గా మార్చేసుకుంటున్నాం. అయితే.. మంచి స్మార్ట్ టీవీ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలనే భయం చాలా మందిలో ఉంటుంది. ఆ టెన్షన్ అక్కర్లేదు! మీ బడ్జెట్‌కు ఏమాత్రం అడ్డు తగలకుండా..అద్భుతమైన ఫీచర్లతో.. మార్కెట్లో హల్ చల్ చేస్తున్న 5 బెస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ టీవీ మోడల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. Xiaomi Redmi Smart TV A Series:
బడ్జెట్ లవర్స్ మొదటి ఛాయిస్ ఎప్పుడూ రెడ్మీ వైపే ఉంటుంది. ఈ సిరీస్ టీవీలు అద్భుతమైన డిస్‌ప్లే.. స్మార్ట్ ఫీచర్లతో వస్తాయి. ఇందులో గూగుల్ టీవీ ఓఎస్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి యాప్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. వాయిస్ అసిస్టెంట్ రిమోట్ దీని ప్రత్యేక ఆకర్షణ. సుమారు రూ. 10,499 నుంచి ప్రారంభమవుతుంది.
నంబర్ వన్ బ్రాండ్ నుంచి తక్కువ ధరలో టీవీ కోరుకునే.. వారికి శాంసంగ్ బెస్ట్ ఆప్షన్. ఇది ఎంతో నమ్మకమైన బ్రాండ్. శాంసంగ్ సొంత టైజెన్ ఓఎస్ పై ఇది పని చేస్తుంది. ప్యూర్ కలర్ టెక్నాలజీ వల్ల .. వీడియోలు చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. పిల్లల కోసం.. స్మార్ట్ కంట్రోల్స్, గేమింగ్ మోడ్ కూడా లభిస్తాయి. సుమారు రూ.11,990 నుంచి అందుబాటులో ఉంది.
ట్రెండీ లుక్, ప్రీమియం ఫీచర్స్ కోరుకునే.. యూజర్లకు వన్‌ప్లస్ వై సిరీస్ చక్కటి ఆప్షన్. బెజెల్-లెస్ డిజైన్ దీని సొంతం. అంటే.. స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తుంది.గామా ఇంజిన్ పిక్చర్ క్వాలిటీని మరింత మెరుగు పరుస్తుంది. డాల్బీ ఆడియో స్పీకర్లు ఇంట్లోనే.. థియేటర్ ఫీలింగ్ ఇస్తాయి. మార్కెట్లో సుమారు రూ. 12,499 ధరలో లభిస్తుంది.
Also Read: రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ సౌండ్‌బార్..ఆర్జీబీ లైట్స్‌తో అదుర్స్
పెద్ద స్క్రీన్, అల్ట్రా హెచ్‌డీ ఫీల్ కోరుకునే వారి కోసం రియల్‌మీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. పవర్ ఫుల్ స్పీకర్లు, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో ఇది వస్తుంది. 4K రిజల్యూషన్ ఉండటం వల్ల ప్రతి చిన్న సీన్ చాలా క్లియర్‌గా ఎంజాయ్ చేయెచ్చు. గేమింగ్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సుమారు రూ.18,299 వరకు ఉంటుంది.
క్వాలిటీ విషయంలో.. ఎల్జీ బ్రాండ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ బడ్జెట్ మోడల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎల్జీ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్, యూజర్ ఫ్రెండ్లీ వెబ్ఓఎస్ దీని సొంతం.కంటెంట్ సెర్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కంటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. యాంటీ-బ్లూ లైట్ టెక్నాలజీని వాడారు. సుమారు రూ. 11,990 నుంచి ప్రారంభమవుతుంది.
మొత్తానికి..తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వినోదాన్ని పంచే ఈ స్మార్ట్ టీవీలు మీ ఇంట్లోని లివింగ్ రూమ్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. మీ అవసరాలకు తగిన స్క్రీన్ సైజును ఎంచుకుని.. ఈ వీకెండ్‌లో మీ ఇంటికి ఒక అఫోర్డబుల్ స్మార్ట్ టీవీని తెచ్చుకోండి. కుటుంబంతో కలిసి పండగ లాంటి సినిమా ఫీల్ ఎంజాయ్ చేయండి.