IPL TEAMS WANTS GAMBHIR AS MENTOR: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) కోసం ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి. హెడ్ కోచ్ పదవిలో ఉన్న గౌతమ్ గంభీర్ తమ జట్టుకు మెంటార్ గా వ్యవహరించాలని దాదాపు నాలుగు ఐపీఎల్ ( IPL) ఫ్రాంచైజీలు అతన్ని సంప్రదించినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీమిండియాతో ఉన్న ఒప్పందం ముగిసిన తర్వాత కచ్చితంగా తమ జట్టులోకి రావాలంటూ ఈ నాలుగు టీమ్స్ అతడి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
గౌతమ్ గంభీర్ ఎంత అడిగితే, అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. గంభీర్ హయాంలో టీమిండియా ( Team India) అగ్రశ్రేణి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలోనే అతని సేవలను వినియోగించుకునేందుకు ఈ నాలుగు జట్లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ ఓకే అంటే.. కోట్ల వర్షం కురిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయట ఈ ఫ్రాంచైజీలు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. బీసీసీఐతో ఉన్న ఒప్పందం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు ఆ పదవిలోనే కొనసాగాలి. వరల్డ్ కప్ గెలిస్తే, అతని పదవీకాలం మరో ఏడాది వరకు పొడగిస్తారు. అంటే 2028 వరకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గానే ఉంటాడన్నమాట. బీసీసీఐ ఇచ్చిన పదవుల్లో ఉంటూ ఇతర లీగ్స్ కు ఏ ఒక్కరు పని చేయరాదు. అందుకే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఏ ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా పని చేయలేడు. ఎన్ని బంపర్ ఆఫర్లు వచ్చినా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తేనే ఇతర ఫ్రాంచైజీకి సేవలు అందించవచ్చు. అంటే ఈ లెక్కన 2028 వరకు ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించిన నాలుగు ఫ్రాంచైజీలు ఆగాల్సిందే. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ మెంటార్ గా బరిలోకి దిగనున్నాడు.
గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా నియామకం చేసుకునేందుకు మొత్తం నాలుగు ఫ్రాంచైజీలు క్యూ కట్టాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ పేరు బయటకు రాగా.. మిగిలిన మూడు జట్ల పేర్లు మాత్రం తెలియ రాలేదు. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఆర్సీబీ గతంలో కేకేఆర్ జట్టుకు మెంటార్ గా పనిచేసే ఐపీఎల్ 2024 టైటిల్ అందించడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా అతడు గతంలో పనిచేసి రెండుసార్లు ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతడి సక్సెస్ రేట్ చూసి మెంటార్ గా నియామకం చేసుకునేందుకు ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి.