E-Paper
Advertisement

యాపిల్, శాంసంగ్‌కు పోటీగా ఇండియన్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

యాపిల్, శాంసంగ్‌కు పోటీగా ఇండియన్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Advertisement

Made in India Smartphone: స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో ఇప్పటి వరకు యాపిల్, శాంసంగ్ లాంటి అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. చైనాకు చెందిన షావోమీ, వివో, ఒప్పో లాంటి బ్రాండ్లు కూడా భారత మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే, త్వరలో ఈ పోటీలోకి  భారతీయ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. భారత్‌ లోనే డిజైన్ చేసి, తయారు చేసి, భారతీయ బ్రాండ్ పేరుతో ఫోన్లను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.

2028 అక్టోబర్ 23 నాటికి.. 

తాజాగా ఢిల్లీలో జరిగిన NDTV వరల్డ్ సమ్మిట్ 2026లో పాల్గొన్న అశ్విని వైష్ణవ్.. భారతీయ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. 2028 అక్టోబర్ 23 నాటికి భారత్‌లో డిజైన్ చేసిన, భారత్‌లోనే తయారైన, భారతీయ బ్రాండ్ పేరుతో విక్రయించే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్‌కు సొంతంగా యాపిల్, శాంసంగ్ స్థాయి కంపెనీలు ఎందుకు ఉండకూడదనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండు కంపెనీలతో మొదలైన ప్రయత్నాలు

Advertisement

భారతీయ స్మార్ట్‌ ఫోన్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు సుమారు మూడేళ్ల క్రితమే ప్రభుత్వం దేశీయ డిజైనర్లకు ఓ సవాల్ విసిరిందని మంత్రి తెలిపారు. మొబైల్ ఫోన్‌లో అత్యంత కీలకమైన మదర్‌ బోర్డ్‌ గా పనిచేసే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB)ను భారతీయ కంపెనీలే డిజైన్ చేయాలని సూచించినట్లు చెప్పారు. ఈ సవాల్‌ను రెండు కంపెనీలు స్వీకరించాయి. వాటిలో ఒక కంపెనీ రూపొందించిన డిజైన్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ కంపెనీ ఇప్పటికే 5G+ స్మార్ట్‌ ఫోన్‌ను డిజైన్ చేసి, తయారు చేసి అమెరికాలోని వినియోగదారులకు అందించిందని వివరించారు. అయితే ,ఆ రెండు కంపెనీల పేర్లను, అమెరికా టెలికాం సంస్థ పేరును మంత్రి వెల్లడించలేదు.

భారతీయ బ్రాండ్ ప్రత్యేకత ఏంటి?

స్మార్ట్‌ ఫోన్ తయారీ అనేది అంత సులభమైన విషయం కాదని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఒక చిన్న ఫోన్‌లో యాంటెన్నా, ప్రాసెసర్, మెమొరీ, కెమెరా, డిస్‌ప్లే, పవర్ మేనేజ్‌మెంట్ లాంటి అనేక భాగాలను ఎంతో నైపుణ్యంతో అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. బరువు, బ్యాటరీ వినియోగం, పనితీరు లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు భారత్‌లో విదేశీ బ్రాండ్ల ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్ ఎక్కువగా జరుగుతుండగా.. ఇకపై సొంత డిజైన్, సొంత సాంకేతిక పరిజ్ఞానం, మేధో సంపత్తి (IP) దేశంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

యాపిల్, శాంసంగ్‌కు పోటీ ఇవ్వగలదా?

Advertisement

కొత్త భారతీయ బ్రాండ్ మార్కెట్లో ఎంతటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పటి వరకు బ్రాండ్ పేరు, ఫోన్ ఫీచర్లు, ధర, కెమెరా వివరాలు వెల్లడికాలేదు. సో,యాపిల్, శాంసంగ్‌లకు ఎంతవరకు పోటీ ఇస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం అంటున్నారు నిపుణులు.

Read Also: మనసు మార్చుకున్న యాపిల్.. టచ్‌స్క్రీన్‌తో MacBook Pro లాంచ్, ధర ఎంతంటే?

Tags

Related News

తక్కువ ధరలో..సినిమా థియేటర్ మజా,టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలివే!

రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ సౌండ్‌బార్..ఆర్జీబీ లైట్స్‌తో అదుర్స్

జియో ఆల్ రౌండర్ ప్లాన్.. రూ.399 కే అపరిమిత 5G, కాల్స్, ఓటీటీలు.. రూ.39,000 విలువైన సేవలు ఫ్రీ!

కరెంట్, ఐస్ లేకుండానే వ్యాక్సిన్లు కూల్.. ఇండోర్ కుర్రాళ్ల అద్భుతమైన ఆవిష్కరణ!

పైసా ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా చేయొచ్చు.. అదెలాగంటే?

మనసు మార్చుకున్న యాపిల్.. టచ్‌స్క్రీన్‌తో MacBook Pro లాంచ్, ధర ఎంతంటే?

ఇన్‌స్టంట్ గీజర్ Vs స్టోరేజ్ గీజర్..మీ ఇంటికి ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×