Jio Plans: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సర్ ప్రైజింగ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో వచ్చిన రూ. 399 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ బడ్జెట్ లో ఆల్ రౌండర్ ప్లాన్ గా ఇది ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో రూ. 399 ప్లాన్ ప్రత్యేకతలు ఏంటి? దీని వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఈ కథనంలో చూద్దాం.
జియో ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు ప్రతీ రోజూ 2.5 GB డేటా యూజర్లకు లభించనుంది. అంటే 28 రోజులకు కలిపి 70 GB డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ భారీ డేటాను ఉపయోగించి యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసుకోవచ్చని.. ఆన్ లైన్ లో హ్యాపీగా గేమ్స్ సైతం ఆడుకోవచ్చని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఈ రూ.399 ప్లాన్‌లో అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం జియో అందిస్తోంది. 5G నెట్ వర్క్ పరిధిలో ఉండి.. 5G స్మార్ట్ ఫోన్ వాడేవారు ఈ సూపర్ ఫాస్ట్ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తోంది. 5G సేవలను ఉపయోగించుకొని భారీ ఫైల్స్ ను క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని.. 4K వీడియోలను సైతం ఎలాంటి బఫరింగ్ లేకుండా చూడొచ్చని జియో వర్గాలు సూచిస్తున్నాయి.
కేవలం డేటానే కాకుండా వినోదం కోసం జియోటీవీ (JioTV), జియోగేమ్స్ (JioGames), జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ సేవలతో పాటు ఫ్యాన్‌కోడ్ (FanCode) సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో లభిస్తాయి. ముఖ్యంగా స్పోర్ట్స్, సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అయితే జియోహాట్‌స్టార్ ఆఫర్‌ను పొందడానికి మునుపటి ప్లాన్ గడువు ముగిసేలోపే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వర్గాలు తెలిపాయి.
Also Read: రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!
మరోవైపు రూ.399 ప్లాన్ కింద మరికొన్ని అడిషన్ బెనిఫిట్స్ ను సైతం జియో ఆఫర్ చేస్తోంది. 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. దీంతో పాటు జియోఏఐక్లౌడ్ (JioAICloud) ద్వారా 50GB స్టోరేజ్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ప్యాక్ లో ఉచిత కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్ సైతం యూజర్లకు లభించనుంది. దీని విలువ రూ.4,000 కు సమానం. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, ప్రమోషనల్ బ్యానర్లు, ప్రెజెంటేషన్లు డిజైన్ చేసుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది.
Also Read: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!