E-Paper
Advertisement

Allu Arjun : పవన్‌పై పంతం నెగ్గించుకోవాల్సిందే… జానీ మాస్టర్ కేసుతో బన్నీ మాస్టర్ ప్లాన్..!

Allu Arjun : పవన్‌పై పంతం నెగ్గించుకోవాల్సిందే… జానీ మాస్టర్ కేసుతో బన్నీ మాస్టర్ ప్లాన్..!
Advertisement

Allu Arjun.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో జరిగే విషయాలకు చాలా దూరంగా ఉండే అల్లు అర్జున్ (Allu Arjun) ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాలపై వేగంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసిపి పార్టీకి మద్దతు ప్రకటించడంతో మెగా అభిమానులే కాదు మెగా హీరోలు, జనసేన నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

బాధిత యువతికి అండగా అల్లు అర్జున్..

Advertisement

దీంతో విసిగి వేపారిన అల్లు అర్జున్ సమయం కోసం ఎదురు చూశారు. అయితే ఆ సమయం జానీ మాస్టర్ రూపంలో ఆయనకు లభించిందని చెప్పవచ్చు. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన బన్నీ.. తాజాగా పవన్ కళ్యాణ్ పై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై రివేంజ్ తీర్చుకోవడానికి జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన బాధిత యువతికి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ.. సానుభుతి ప్రకటించాడు. అలాగే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ పై ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారా..

Advertisement

అసలు విషయంలోకెళితే, జానీ మాస్టర్ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ.. పార్టీపై మరింత మంచి ఇమేజ్ వచ్చే ప్రయత్నం చేసారు జానీ. అయితే అలాంటి వ్యక్తిపై సడన్ గా ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో వైసీపీ శ్రేణులతో పాటు మరికొంతమంది జనసేన నుండి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయగా, నిన్న జానీ మాస్టర్ పై యాక్షన్ తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

Allu Arjun : Pawan must be bet on... Bunny Master's plan with Johnny Master's case..!

పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య పావుగా మారిన జానీ మాస్టర్..

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు విరుద్ధంగా బాధిత యువతికి సపోర్టుగా నిలిచారు బన్నీ. దీన్ని బట్టి చూస్తే అటు అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ గొడవకు జానీ మాస్టర్ పావుగా మారిపోయాడనే వార్తలు స్పష్టం అవుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ కు యాంటీగా ఉన్నవారు జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా పోస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పూనమ్ కౌర్, సింగర్ చిన్మయి తోపాటు పలువురు వైసిపి శ్రేణులు కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా పోస్ట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై రివేంజ్ తీర్చుకోవడానికి బన్నీకి జానీ మాస్టర్ పేరిట ఒక మంచి ఆయుధం దొరికిందని చెప్పవచ్చు.

లైంగిక వేధింపులకు గురైన మహిళా కొరియోగ్రాఫర్..

లైంగిక వేధింపుల విషయానికి వస్తే..21 సంవత్సరాల మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించింది. 2017లో ఒక షోలో తనకు పరిచయం అయ్యాడని, ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు అక్కడ హోటల్లో బస చేయగా, ఆ సమయంలో తనపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశాడని, అంతేకాదు పలుమార్లు నార్సింగిలోని తన నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడని, కేరవాన్ లో కూడా ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడు అంటూ బాధిత యువతి పోలీసుల ముందు తన బాధను చెప్పుకుంది. దీంతో తాజాగా నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీఎస్ సెక్షన్ 376 , 506 అంటూ పలు కేసులు నమోదు చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×