E-Paper
Advertisement

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!
Advertisement

Recharge Offers : ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ రీచార్జ్ ప్లాన్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్లాన్స్ మార్చేస్తూ కస్టమర్స్ పైన భారం వేసేస్తున్నాయి. తాజాగా పెరిగిన రీచార్జ్ ప్లాన్స్ కస్టమర్స్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఓ కంపెనీ ఫ్రీ ఇంటర్నెట్ను అందించటానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నారు కదూ.. కానీ నమ్మేయండి.

ప్రైయివేట్ టెలికాం సంస్థలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేస్తున్న వేళ మార్పు కోసం ప్రముఖ కంపెనీలు గట్టిప్రయత్నాలే చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటు ధరలో డేటాతో పాటు మిగిలిన ఆఫర్స్ అందించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ లో టాటా కంపెనీ పెట్టుబడి పెట్టి అతి తక్కవకే ప్లాన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలు అందించటానికి ఎక్సిటెల్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ తన కస్టమర్లకు 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వటమే కాకుండా 18 రకాల OTT సబ్‌స్క్రిప్షన్స్ సైతం అందిస్తోంది.

Advertisement

ALSO READ : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

ఎక్సిటెల్ కంపెనీ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కంపెనీ 3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్, 18 రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇందులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సబ్ స్క్రిప్షన్స్ సైతం ఉన్నాయి. ఎక్సైటెల్ కంపెనీ తీసుకువచ్చిన రూ.499తో కొత్త రీఛార్జ్ చేయిస్తే 9నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగించాక మరో 3 నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్ వాడుకునే అవకాశం లభిస్తుంది. ఇక దీంతో పాటు 18 OTT ప్లాట్‌ఫారమ్స్, 150 కంటే ఎక్కువ ఛానెల్‌లను ఈ ఆఫర్ తో చూడవచ్చు. ఇందులో అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్ వంటి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి.

Advertisement

ఆఫర్ లో భాగంగా నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందిస్తామని.. తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ ను పొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్లో ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, ఉచిత స్మార్ట్ టీవీ, HD ప్రొజెక్టర్‌ను కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా ఎక్సిటెల్ కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 35 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. ఎక్సిటెల్ కంపెనీ ఈ ప్లాన్ తో పాటూ Excitel బిగ్ స్క్రీన్ ప్లాన్ అనే మరో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రారంభించింది. వీటి ధర రూ.1,299, రూ.1,499 గా ఉంది. ఈ ప్లాన్స్ లో సైతం వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఉచిత స్మార్ట్ టీవీ లేదా HD ప్రొజెక్టర్‌, ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, OTT సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంది. ఇక తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ పొందాలి అనుకునే వారు ఈ ఆఫర్స్ ను ట్రై చెయ్యెచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×