BigTV English

Bigg Boss 8 Telugu Promo: మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు

Bigg Boss 8 Telugu Promo: మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని చెప్పి ఇప్పటికే కంటెస్టెంట్‌కు ఒక షాక్ తగిలింది. ఇక వారికి తెలియని విషయం ఏంటంటే.. ఈవారం మిడ్ వీక్‌లో కూడా ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి వీకెండ్ ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులకు రివీల్ చేశారు నాగార్జున. కానీ ఈ విషయం కంటెస్టెంట్స్‌కు మాత్రం తెలియదు. తాజాగా విడుదలయిన ప్రోమోలో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కంటెస్టెంట్స్‌కు రివీల్ చేశారు బిగ్ బాస్. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంతే కాకుండా డేంజర్ జోన్‌లో ఉన్న ముగ్గురిలో ఎవరు సేవ్ అవుతారు అనే నిర్ణయాన్ని కూడా మరోసారి హౌస్‌మేట్స్ చేతిలోనే పెట్టారు బిగ్ బాస్.


ఎలిమినేషన్‌కు సిద్ధంగా ఉండండి

కంటెస్టెంట్స్ అంతా ఎవరి పనిలో వారు బిజీగా ఉండగా బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ మొదలుపెట్టారు. ‘‘ప్రతీరోజూ లాగానే మొదలయిన ఈరోజు మీలో ఒకరికి పీడకలగా మారబోతోంది. మీలో నుండి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లనున్నారు. మీ బ్యాగ్స్‌ను సర్దుకొని ఇంటి సభ్యులు అందరికీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి’’ అంటూ బిగ్ బాస్ చేసిన ప్రకటనతో ప్రోమో మొదలవుతుంది. ఉన్నట్టుండి ఎలిమినేషన్ అనడంతో హౌస్‌మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా నైనికా, విష్ణుప్రియా, సీత.. ఒక టీమ్‌లాగా ఉండేవారు. వారంతా ఒకరితో మరొకరు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ముగ్గురిలో ఎవరూ వెళ్లిపోయినా తట్టుకోలేమంటూ ఏడవడం మొదలుపెట్టారు.


Also Read: ఏంటి నిజమా.. బిగ్ బాస్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

ఎమోషనల్ కనెక్షన్

ముందుగా ‘‘నాకు వెళ్లాలని లేదు’’ అంటూ నైనికా ఏడవడం మొదలుపెట్టింది. సీత కూడా.. ‘‘గర్ల్స్ నేను ఏమైనా హర్ట్ చేసుంటే సారీ’’ అని చెప్పి ఏడ్చేసింది. ఆ తర్వాత ఆదిత్య ఓం, నైనికా, విష్ణుప్రియా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘మీ లెక్క ప్రకారం ఈ ఇంట్లో నుండి ఎవరైతే బయటికి వెళ్తారని అనుకుంటున్నారో వారిని ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి తగిన కారణాలు చెప్పండి’’ అని బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా తన కారణాలు చెప్పడానికి ముందుకొచ్చిన సీత.. విష్ణుప్రియా, నైనికా తనకు చాలా క్లోజ్ అని చెప్తూ వారికే తన సపోర్ట్ అందించింది. తర్వాత వచ్చిన నిఖిల్ కూడా నైనికా, విష్ణుప్రియాకే తన సపోర్ట్ అందించాడు. వారితో పోలిస్తే ఆదిత్య ఓం వెనబడ్డాడని కారణం చెప్పాడు.

కంటెస్టెంట్స్ నిర్ణయం

నబీల్ వచ్చి విష్ణుప్రియా వెళ్లిపోవాలంటూ తనను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాడు. ‘‘అప్పుడప్పుడు మాటలు నోరుజారాయి. అవి బయటికి బ్యాడ్‌గా వెళ్లాయేమో’’ అనుకుంటూ తనను డేంజర్ జోన్‌కు మరింత దగ్గరకు తీసుకెళ్లాడు. పృథ్వి వచ్చి అనూహ్యంగా నైనికాను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి డేంజర్ జోన్‌కు దగ్గర తీసుకెళ్లాడు. ‘‘నోరుజారడం వల్ల ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. నేను అలాగే చేసినా నాకు ఛాన్స్ ఇచ్చారు’’ అని గుర్తుచేసుకున్నాడు పృథ్వి. మొత్తానికి డేంజర్ జోన్‌లో ఉన్న ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

Related News

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Big Stories

×