BigTV English
Advertisement

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

 


ED Issues Notice to Congress Leader Former Indian Captain, Azharuddin Over Alleged Money Laundering: టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్లు పంపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అజారుద్దీన్ అక్రమాలకు పాల్పడినట్లు అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. సంఘంలో రూ. 20 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు అజారుద్దీన్ ఈడి ఎదుట కావాల్సి ఉంది.

సెప్టెంబర్ 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అతను 2021లో తన పదవిని విడిచి పెట్టాల్సిన సమయం వచ్చింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై అనేక రకాల చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులపై ఈడి మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. తెలంగాణలోని తొమ్మిది చోట్ల ఈడి దాడులు చేసి పలు రకాల కీలకపత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసింది.


Also Read: Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడి ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు అధిక రేట్లకు కాంట్రాక్టులు ఇచ్చి సంఘానికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించాడు. ఈ కేసులో ఈడి మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి తదుపరి విచారణను కొనసాగిస్తోంది. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారని వార్తలు వస్తున్నాయి.

Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

అయితే.. ఈ తరుణంలోనే.. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు నోటీసులు అందాయట. మరి దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఎలా ముందుకు వెళతారో చూడాలి. కాగా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలోనే టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కొనసాగుతున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో దారుణంగా ఓడిపోయారు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్.

Tags

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×