BigTV English

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Best Gaming phones :  అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Best Gaming phones : ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ల యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌లపైనే ఆధార పడుతున్నారు. అందుకే డేటాతో పాటు మంచి ఫీచర్స్​ ఉన్న స్మార్ట్ ఫోన్లు, కెమెరా ఆప్షన్లు, ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ సపోర్ట్‌ వంటి మెరుగైన స్మార్ట్‌ ఫోన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రతి వారం ఆయా కంపెనీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్​లలోకి విడుదల చేస్తున్నాయి. అలా ఈ అక్టోబర్ నెలలో కొన్ని ఫోన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే కొన్ని మార్కెట్​లోకి వచ్చేశాయి. మరి వీటిలో రూ.25వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఏంటో తెలుసుకుందాం.


1) Poco F6 – ప్రస్తుతం పోకో ఎఫ్​​ 6 ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్​ సేల్​లో రూ.23,999కు అందుబాటులో ఉంది. హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డ్స్​ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1,500 ఇన్​స్టంట్ డిస్కౌంట్​ వస్తుంది. అప్పుడు రూ. 22, 499కి 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ​ దొరుకుతుంది.

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 1.5కె అమోలెడ్‌ స్క్రీన్, 90 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటివి ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. బ్లాక్‌, టైటానియన్‌ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తాయి. ఇది ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ ఓఎస్‌పై నడుస్తుంది. 6.67 ఇంచ్, 2400 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్​తో 1.5 రిజల్యూషన్‌తో అమోలెడ్​ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్‌ రేటుతో వచ్చింది. ఇంకా 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 2160 Hz ఇన్​స్టంట్ సాంప్లింగ్ రేట్​, 1920 Hz పీడబ్లూఎమ్​తో వచ్చింది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 8 ఎస్​ జనరేషన్‌ 3 చిప్​సెట్​ను అమర్చారు. గ్రాఫిక్స్​ ఇంట్రెన్సివ్​ టాస్క్​ల కోసం 735 జీపీయు అడ్రినో కూడా ఉంది.


వెనక వైపు 50 మెగా పిక్సల్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా, 8 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 12జీబీ LPDDR5x ర్యామ్​, 512జీబీ యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ వరకు అది ఆఫర్ చేస్తుంది.

ALSO READ : ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్.. దిగివస్తున్న ఆపిల్ ధరలు 

2) Realme GT 6T – రియల్ మీ జీటీ 6టీ అమెజాన్​ గ్రేట్ ఇండియన్ సేల్​లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.29,999కు దొరుకుతుంది. ఎస్​బీఐ క్రెడిట్ కార్డ్​పై పేమెంట్ చేస్తే రూ.2250 బ్యాంక్ డిస్కౌంట్, రూ.3వేల కూపన్​తో ఈ ధర మరింత తగ్గుతుంది. దీంతో రూ.24, 748కు లభిస్తుంది.

ఫీచర్ విషయానికొస్తే.. 6.78 ఇంచ్ LTPO కర్వ్​డ్​ అమోలెడ్​ ప్యానెల్​, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 6000 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్​తో వచ్చింది. 2500 హెచ్​జెడ్​ ఇన్​స్టంట్​ టాచ్ సాంప్లింగ్ రేట్​ ఉంది. కార్నింగ్​ గొరిల్లా గ్లాస్ విక్టస్​ 2 ప్రొటెక్షన్​తో పాటు దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెన్స్​ కోసం ఐపీ 65రేటింగ్​తో వచ్చింది.

3) OnePlus Nord CE 4 – ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6.7ఇంచ్ ఫుల్ హెచ్​డీ, అమోలెడ్​ డిస్​ప్లే, 120 హెచ్​జెడ్​తో వచ్చింది. 210 హెచ్​జెడ్ సాంప్లింగ్ రేట్​ను కలిగి ఉంది. క్లాల్​కమ్​ స్నాప్​డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్​ఓసీతో నడుస్తుంది. ఇందులో హెవీ గ్రాఫిక్స్​ టాస్క్​ల కోసం ఆడ్రినో 720 జీపీయూ ఉంది. 8జీబీ LPDDR5x ర్యామ్​, 256జీబీ యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ వరకు అది ఆఫర్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్​ సోనీ LYT600 ప్రైమరీ సెన్సార్​ ఓఐఎస్​తో నడుస్తుంది. 8 మెగా పిక్సల్​ సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్​ ఉన్నాయి. అలానే సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. 100W సపోర్ట్ కోసం 5500 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14పై ఇది నడుస్తుంది. అలానే 2 ఏళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్​, 3ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తుంది.

4) Motorola Edge 50 – ఈ స్మార్ట్ ఫోన్ రూ.26,999కు ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్​ డేస్​లో లభిస్తుంది. అయితే రూ.2వేలు ఇన్​స్టంట్ డిస్కౌంట్​ కోసం హెడ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డ్​పై పేమెంట్ చేయాలి. అప్పుడు రూ.24,999కు దొరుకుతుంది. ఫీచర్ల విషయానికొస్తే 6.67 ఇంచ్ కర్వడ్​, 120 హెచ్​జెడ్​ పోలెడ్​ డిస్​ప్లేతో వచ్చింది. ముందు వైపు కార్నింగ్​ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది.

 

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×