E-Paper
Advertisement

AP SSC Hall Tickets: ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

AP SSC Hall Tickets: ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
Advertisement

AP SSC Hall Tickets: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు గురువారం విడుదల అయ్యాయి. మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in నుంచి నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌తో పాటు, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ (9552300009), పాఠశాల విద్యా శాఖ LEAP యాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 2న హాల్ టికెట్ లింక్ యాక్టివేట్ చేసింది బోర్డు. అయితే ఆ తరువాత దాన్ని డీయాక్టివేట్ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ వారంలో డౌన్‌లోడ్ అవకాశం కల్పించింది.

హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, విద్యార్థులకు అందించేందుకు పాఠశాల అధికారులకు ప్రత్యేక లాగిన్ వివరాలను బోర్డు అందించింది. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు విద్యార్థులు అడ్మిట్ కార్డులను పొందాలని అధికారులు సూచించారు.

ఏపీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ 2026…డౌన్‌లోడ్ ఇలా

Advertisement

1. పదో తరగతి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in పై క్లిక్ చేయండి.
2.హోమ్‌పేజీలో “AP SSC Hall Ticket 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
3. అవసరమైన లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా ధృవీకరణ చేయండి.
4. హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
5. భవిష్యత్ ఉపయోగం కోసం హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
6. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి అనుమతించరు.

ఏపీ ఎస్ఎస్సీ పరీక్ష తేదీలు

ఏపీ ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, స్కూల్ పేరు, పరీక్షా కేంద్రం, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్, ముఖ్యమైన సూచనలు ఉంటాయి. అభ్యర్థులు తమ వివరాలను తనిఖీ చేసుకుని, ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే వారి పాఠశాల అధికారులకు తెలియజేయాలి.

Advertisement

Also Read:   ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి16 నుంచి ఎగ్జామ్స్

టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. హాల్‌ టికెట్‌ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×