Smartphones Under 15000 : కొత్త ఏడాది గ్రాండ్ గా ప్రారంభమైపోయింది. ఈ ఏడాది ఎన్నో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ కు సిద్ధమైపోయాయి. ఇప్పటికే వన్ ప్లస్ 13 సిరీస్ ఇండియాలోకి అడుగుపెట్టేసింది. దీంతో పాటు సామ్ సాంగ్, యాపిల్ సైతం కొత్త మెుబైల్స్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక అదిరే ఫీర్స్ తో తక్కువ ధరలోనే కొనగలిగే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో అదిరిపోయే డిస్ ప్లేతో పాటు కెమెరా ఫీచర్స్ సైతం కిర్రాక్ అనిపిస్తున్నాయి. ప్రాసెసర్, బ్యాటరీ ఫీచర్స్ సైతం అదిరేలా ఉన్నాయి. వీటిలో ఐక్యూ, రియల్ మీ, టెక్నో, రెడ్ మీ మెుబైల్స్ ఉన్నాయి. మరీ ఈ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి. వాటి ధర, ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే
iQOO Z9 Lite 5G –
iQOO Z9 Lite 5G ధర రూ.11,499. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 720×1612 రిజల్యూషన్, 90HZ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు క్లిక్ చేయడానికి 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Realme Narzo 70 Turbo –
Realme Narzo 70 Turbo ధర రూ. 16,594. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ మొబైల్ పై బెస్ట్ డీల్ ను అందిస్తున్నాయి. భారీ తగ్గింపు ఉండటంతో రూ.15000కే ఈ ఫోన్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB, 12GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ 5000mAh బ్యాటరీ సదుపాయం కూడా ఉన్నాయి.
Tecno Pova 6 Neo –
Tecno Pova 6 నియో రూ. 13,999కే అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, 108MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, HiOS 14.5 వంటి బెస్ట్ ఫీచర్లతో లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14, 128GB, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆధారంగా పనిచేస్తుంది. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్నైట్ షేడ్స్ లో అందుబాటులోకి వచ్చేసింది.
Redmi 13C –
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9099. ఇది MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్‌తో వచ్చేసింది. MIUI 14, Android 13.0 పై రన్ అవుతుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.74″ HD+ 90Hz డిస్‌ప్లే, 50MP AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్, 5000mAh బ్యాటరీ, 50MP AI డ్యూయల్ కెమెరాతో పాటు ప్రైమరీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.