Los Angeles Wildfire: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు అక్కడి ప్రజలను భయపెడుతోంది. కార్చిచ్చు ధాటికి ఇప్పటికి కొంతమంది మృతిచెందారు. పొగతో నిండిన లోయలు, హాలీవుడ్ ప్రముఖులు, స్పోర్ట్స్ ప్రముఖులు నివసించే సుందరమైన భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఐదు రోజుల క్రితం మొదలైన వరుస మంటలు దక్షిణ కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. అమెరికా సినీ పరిశ్రమ హాలీవుడ్ కు నిలయమైన లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో విధ్వంసం మరింత ఎక్కువగా జరిగింది. శాంటా మోనికా పర్వతాలకు ఎదురుగా ‘స్వర్గధామం’లా ఉండే కొండ ప్రాంతాలు, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంతాలు బూడిదగా మారాయి.
అయితే.. లాస్‌ఏంజిల్స్‌లో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. మాలిబులోని 9 మిలియన్ డాలర్లతో నిర్మించిన భవంతి మంటల నుంచి బయటపడింది. చుట్టూ ఉన్న బిల్డింగులు మంటల్లో కాలిపోతున్నప్పటికి సుందరమైన ఈ భవంతి అగ్ని ప్రమాదం నుంచి బయటపడింది. డేవిడ్ స్టైనర్ టెక్సాక్‌కు చెందిన ఈ భవంతి గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది ఓ అద్భుతమైన ఘటనగా చెప్పవచ్చు. డేవిడ్ స్టైనర్ మాట్లాడుతూ.. చుట్టూ ఉన్న 10వేల గృహాలు మంటల్లో నాశనమవుతున్నప్పటికి తన భవంతి అగ్నిప్రమాదం నుంచి బయటపడిందని అన్నారు. చుట్టు పక్కల గృహాలు మంటల్లో బూడిద అయిపోయాయని అన్నారు.
మంటలు మొత్తం ఆరిపోయాక అన్ని బిల్డింగులు బూడిదగా మారినా.. తన భవనం అద్భుతంగా ఉందని అన్నారు. దీంతో చాలా మంది డేవిడ్ స్టెయినర్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా స్టెయినర్ మాట్లాడుతూ.. హ్యూస్టన్-బేస్‌డ్ కంపెనీ వేస్ట్ మేనేజ్‌మెంట్ తన భవంతిని నిర్మించిందని అన్నారు. తన ఇల్లును ధృడంగా నిర్మించారని, భూకంపాలు, అగ్ని నుంచి రక్షించేలా ఇంటిని నిర్మించారిని చెప్పారు. తన ఇంటి చుట్టు పక్కల ప్రాంతంలో 1,30,000 కుటుంబాలు గృహాల కుటుంబాలు బయటకు పోయినప్పటికీ.. తన ఇళ్లు మాత్రం సురక్షితంగా ఉందని అన్నారు.
Also Read: HoneyRose : మరోసారి చిక్కుల్లో పడిన హనీరోజ్.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే!
4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో, నాలుగు పడక గదుల ఇంటిని స్టెయినర్ ఓ నిర్మాత నుంచి కొనుగోలో చేశానని చెప్పారు. అయితే చుట్టు పక్కల ఇళ్లు భారీగా ప్రమాదానికి గురయ్యాయి. స్టెయినర్ మాట్లాడుతూ.. నేను ఆస్తిని మాత్రమే కోల్పోయాను.. కానీ చాలా మంది తమ ఇళ్లను కోల్పోయారని.. బాధితులను చూస్తే గుండె తరుక్కుమంటుంది అని అన్నారు.