E-Paper
Advertisement

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!
Advertisement

Best Soundbars Under 15000: టీవీలో సినిమా చూస్తున్నప్పుడు హీరో చెప్పే డైలాగులు సరిగ్గా వినిపించకపోయినా, యాక్షన్ సీన్లలో కావాల్సినంత బేస్ లేకపోయినా మూవీ చూసే ఇంట్రెస్టే పోతుంది. అలాగని ఎక్కువ డబ్బులు పెట్టి కొత్త టీవీ కొనాల్సిన పని లేదు. దీని కోసం ఒక మంచి సౌండ్‌బార్ ఉంటే చాలు. దీంతో మీ ఇల్లే ఒక మినీ థియేటర్‌గా మారిపోతుంది. ప్రస్తుతం రూ.15,000 లోపు వైర్‌లెస్ సబ్‌వూఫర్, సరౌండ్ సౌండ్, బ్లూటూత్ వంటి అదిరిపోయే ఫీచర్లతో కొన్ని సౌండ్‌బార్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి మోడల్‌లో సౌండ్ క్వాలిటీ, స్పీకర్ల సెటప్ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి.. మీ అవసరానికి తగ్గట్టు బెస్ట్ ఆప్షన్ ఎంచుకునేలా, రూ.15 వేలలోపు దొరికే 4 అద్భుతమైన సౌండ్‌బార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Blaupunkt Atomik Knightz 25K:

ఇంట్లో సినిమాలతో పాటు బయట పార్టీలకు కూడా ఉపయోగపడే సౌండ్‌బార్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 120W సౌండ్ అవుట్‌పుట్‌తో పాటు 4 ఇంచుల వూఫర్, రెండు స్పీకర్లు ఉన్నాయి. దీంతో పాటు వచ్చే వైర్‌లెస్ కరోకే మైక్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులోని 8,800mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఇస్తుంది. వాటర్ స్ప్లాష్ ప్రొటెక్షన్, 9 ఆరా లైట్ మోడ్స్ ఉన్న ఈ మోడల్ ధర రూ.14,990గా ఉంది.

Samsung HW-C45E/XL Soundbar

Advertisement

సినిమాలు, గేమింగ్ అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి శాంసంగ్ ఈ 2.1 ఛానెల్ సౌండ్‌బార్‌ను రూపొందించింది. వైర్ల గొడవ లేకుండా డీప్ బేస్ అందించే వైర్‌లెస్ సబ్‌వూఫర్ దీని ప్రత్యేకత. 300W పవర్‌ఫుల్ సౌండ్‌తో పాటు డాల్బీ 2.0, బేస్ బూస్ట్, గేమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాత్రిపూట ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా డైలాగ్స్ స్పష్టంగా వినిపించే నైట్ మోడ్ కూడా ఇందులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర సుమారు రూ.12,990 వరకు ఉంది.

Also Read: సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

JBL Cinema SB270 Soundbar

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఆడియో క్వాలిటీ కోరుకునే వారికి జేబీఎల్ ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్. ఈ 2.1 ఛానెల్ సౌండ్‌బార్ 220W సౌండ్ అవుట్‌పుట్‌తో పాటు వైర్‌లెస్ సబ్‌వూఫర్‌ను కలిగి ఉంది. సినిమాల్లోని యాక్షన్ సీన్స్, పాటలకు అదనపు బేస్ తోడై మంచి అనుభూతిని ఇస్తుంది. డాల్బీ డిజిటల్ ఆడియో సపోర్ట్ ఉన్న ఈ సౌండ్‌బార్ ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.9,999 ధరకే లభిస్తోంది.

boAt Aavante Prime 5.1 Soundbar

గది నలుమూలల నుంచి సౌండ్ వినిపించే థియేటర్ అనుభూతి కావాలంటే ఈ 5.1 ఛానెల్ సౌండ్‌బార్ ఎంచుకోవచ్చు. ఇందులో వైర్డ్ సబ్‌వూఫర్‌తో పాటు రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. 3డి సౌండ్‌స్కేప్ ఫీచర్, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.11,999కి అందుబాటులో ఉంది. మీ గది సైజు, అవసరాలను బట్టి వీటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

Also Read: వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

Tags

Related News

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

Big Stories

Advertisement
×