WhatsApp Sticker Reactions: వాట్సప్‌లో మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, ఎమోజీలతో రియాక్షన్ పంపడం మనందరికీ తెలిసిందే. అయితే త్వరలో ఈ అనుభవం మరింత సరదాగా మారనుంది. ఇప్పటివరకు మెసేజ్‌లకు ఎమోజీలతో మాత్రమే రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉండగా.. ఇకపై స్టిక్కర్లతో కూడా స్పందించవచ్చు. దీనికోసం వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. దీంతో చాటింగ్‌లో మన భావాలను మరింత సరదాగా వ్యక్తం చేసే అవకాశం కలగనుంది.
ప్రస్తుతం వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల (వెర్షన్ 2.26.46.5) కోసం ఈ స్టిక్కర్ రియాక్షన్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోందని WABetaInfo రిపోర్ట్ ద్వారా తెలిసింది. దీనివల్ల యూజర్లు తమ దగ్గర ఉన్న స్టిక్కర్ కలెక్షన్ నుంచి ఏ స్టిక్కర్‌నైనా ఎంచుకుని మెసేజ్‌లకు రియాక్షన్‌గా ఇవ్వొచ్చు. ఇందులో నార్మల్ స్టిక్కర్లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లు కూడా సపోర్ట్ చేయడం విశేషం.
ఈ ఫీచర్ వాడటం చాలా సులభం. మీరు ఏదైనా మెసేజ్‌పై ట్యాప్ చేసి పట్టుకున్నప్పుడు, ఎమోజీ రియాక్షన్ ట్రే పక్కనే కొత్తగా ఒక స్టిక్కర్ షార్ట్‌కట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ స్టిక్కర్ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టిక్కర్ ప్యాక్స్ నుంచి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేస్తే.. అది మెసేజ్ బబుల్ కింద అందరికీ కనిపించేలా యాడ్ అవుతుంది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!
ఎమోజీ రియాక్షన్లలో మనం ఒక్క మెసేజ్‌కి ఒకే ఎమోజీని ఇవ్వగలం. కానీ ఈ స్టిక్కర్ రియాక్షన్లలో అలా కాదు. ఒకే మెసేజ్‌పై ఏకంగా 20 స్టిక్కర్ రియాక్షన్ల వరకు యాడ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. ఒకే స్టిక్కర్‌ను మళ్లీ మళ్లీ కూడా పంపొచ్చు. స్టిక్కర్లు ఎక్కువయ్యే కొద్దీ, మెసేజ్ బబుల్ చుట్టూ అవి నీట్‌గా సర్దుకునేలా వాట్సప్ డిజైన్ చేస్తోంది. అలాగే ఎవరు ఏ స్టిక్కర్ వేశారో చూసుకోవచ్చు. అలాగే వద్దనుకుంటే మన స్టిక్కర్‌ను రిమూవ్ కూడా చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది వారాల్లో మరికొంత మందికి దీన్ని విస్తరించనున్నారు. సాధారణ యూజర్లందరికీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై వాట్సప్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ, త్వరలోనే మనందరి ఫోన్లలోకి ఈ ఫీచర్ రావడం ఖాయం.
Also Read: కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!