E-Paper
Advertisement

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!
Advertisement

S.S.Rajamouli: టాలీవుడ్ దర్శకతీయుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల విషయంలో ఎంతో ఆసక్తి కనబరిస్తూ ఎంతో బిజీగా ఉండే రాజమౌళి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ బ్యూటీ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి రాజమౌళి(Rajamouli) ప్రశంసల కురిపించిన ఆ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే..

టైమ్ 100 నెక్ట్స్ ఇండియా జాబితాలో అలియా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి ఆలియా భట్(Alia Bhatt) విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె  ప్రపంచ ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ తొలిసారిగా రూపొందించిన ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా’ (Time 100 Next India)జాబితాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టైం 100 నెక్స్ట్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై ఆలియా చోటు సంపాదించుకున్నారు. దేశ భవిష్యత్తును తమ పనితీరు, ఆలోచనలు, దృక్పథంతో తీర్చిదిద్దుతున్న  సృజనాత్మక ప్రతిభావంతులకు గుర్తింపుగా టైమ్ ఈ ప్రత్యేక జాబితాను విడుదల చేసింది.

కళ్ళతోనే హావభావాలు పలికించింది..

Advertisement

ఇలా ఈ జాబితాలో అలియా భట్ చోటు సంపాదించుకోవడం పట్ల ఈమెపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆలియా భట్ కి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సైతం ఆలియాకు దక్కిన ఈ గౌరవం పై స్పందిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు…ఆలియా ఆర్ఆర్ఆర్ సెట్స్‌లోకి వచ్చినప్పుడు ఆమె పాత్రకు ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ. కానీ తన కళ్లతో, మౌనంతోనే హావభావాలను పలికించింది.

సీత పాత్రలో జీవించిన అలియా..

ఈమె హిందీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ తెలుగు పై మంచి పట్టు సాధించి ప్రతి ఒక్క డైలాగ్ చాలా స్పష్టంగా చెప్పిందని సినిమా భారం మొత్తం తన భుజాలపైనే ఉందన్నంత బాధ్యతగా సీత పాత్రలో జీవించిందని రాజమౌళి తెలిపారు. ఈమె ఎల్లప్పుడూ ఎంతో కఠినమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వాటిలో చాలా సునాయసంగా నటిస్తోంది.బాఫ్టావంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ఇండియన్ సినీ ఇండస్ట్రీ తరపున ఆమె మాట్లాడిన విధానం ఎంతో గర్వకారణం. రాబోయే తరంలో నటీనటులు వారి ధైర్యాన్ని ఆలియా భట్ తో కొలుచుకుంటారంటూ  ఈ సందర్భంగా ఆలియా భట్ అందుకున్న ఈ గుర్తింపు పై రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Also Read: సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

Related News

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

‘రామాయణ’ మూవీ క్రేజే వేరయా.. మరో సెన్సేషనల్ మార్క్..!

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

వామ్మో.. మాళవిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

Big Stories

Advertisement
×