E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!
Advertisement

Indiramma Sarees: రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మందికి కొత్తగా చేయూత పెన్షన్ దారుల‌ ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేయబోతున్నారు. అదే రోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలకం. అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నెలవారీ ఆర్థిక భరోసా..

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు కొత్తగా మంజూరయ్యే 4,63,857 చేయూత పెన్షన్లు వారి కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసాను అందిస్తాయి. పెన్షన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఈ నెల 26నుంచే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని, పెన్షన్ మొత్తం అదే రోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రతకు నిదర్శనం.

Advertisement

Also Read: ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 26న చేపడుతున్నారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డకు చీర అంటే కేవలం వస్త్రం కాదని, పుట్టింటి ఆత్మీయత, గౌరవానికి ప్రతీక. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇందిరమ్మ చీరలను అందిస్తున్నారు. మహిళలకు చీర అందించడంతో పాటు వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలను కల్పిస్తూ ఆర్థిక సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.

ప్రజాప్రభుత్వం పాలన దృక్పథం: మంత్రి సీతక్క

Advertisement

రాజ్యాంగ స్ఫూర్తితో నవంబర్ 26న ఒకే వేదికగా రెండు కీలక కార్యక్రమాలు ప్రారంభం కావడం ద్వారా ప్రజా ప్రభుత్వం తన పాలనా దృక్పథాన్ని చాటుతోంది. చేయూత ద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ చీర ద్వారా మహిళలకు ఆత్మీయత, గౌరవం అందిస్తున్నాం. రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వం ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగి రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారేలా మరిన్ని కార్యక్రమాలను కొనసాగిస్తాం.

Also Read: పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ 7 సందర్భాల్లో మాత్రం మీకే నష్టం

Tags

Related News

ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం, హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మంటలు, పరుగులు పెట్టిన ప్రజలు

కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి ఇష్యూ.. టీపీసీసీ మహేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు, వేటు తప్పదా?

హైదరాబాదీలకు బంపరాఫర్.. ఇంటికో ఇంకుడు గుంత, రూ. 10 లక్షలు గెలవండి!

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

Big Stories

Advertisement
×