E-Paper
Advertisement

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్
Advertisement

Philips TAX2504/94: వీకెండ్ హౌస్ పార్టీలు, టెర్రస్ గెట్‌టుగెదర్స్, చిన్న ఫంక్షన్లలో మొబైల్ స్పీకర్ల సౌండ్ సరి పోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి పోర్టబుల్ పార్టీ స్పీకర్లు మంచి ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. ఫిలిప్స్ ఇటీవల తన కొత్త ఆడియో సిరీస్‌లో భాగంగా ఈ మోడల్‌తో పాటు ఇతర ఆడియో డివైజ్‌లను పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే పవర్‌ఫుల్ సౌండ్, కరావోకే ఫీచర్, లైటింగ్ ఎఫెక్ట్స్ కోరుకునేవారిని ఈ మోడల్ తెగ ఆకట్టుకుంటోంది.

పూర్తి ఫీచర్లు:

1. సౌండ్ అవుట్‌పుట్ & బేస్ పర్ఫార్మెన్స్:

ఈ స్పీకర్‌లో గరిష్టంగా 80W ఆడియో అవుట్‌ పుట్ లభిస్తుంది. ఇందులో.. 8-ఇంచుల వూఫర్ , 1.3-అంగుళాల ట్వీటర్ ఉపయోగించారు. ఈ కాంబినేషన్ వల్ల లో-ఎండ్ బేస్ పంచ్‌గా ఉంటూనే, హై-ఫ్రీక్వెన్సీ సౌండ్ క్లియర్‌గా వినిపిస్తుంది. అదనంగా ట్రెబుల్ & బాస్ కంట్రోల్స్, డీజే ఎఫెక్ట్స్, పార్టీ సౌండ్ మోడ్స్ ఉండటం వల్ల పాటల బీట్స్‌కి తగ్గట్టు సౌండ్‌ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోవచ్చు. చిన్న హాళ్లు.. లేదా ఓపెన్ ఏరియాల్లో మ్యూజిక్ ప్లే చేసినా రూమ్ నిండే సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

2. వైర్‌లెస్ మైక్ & కరావోకే ఫన్:

Advertisement

ఫ్రెండ్స్‌తో కలిసి.. పాటలు పాడాలనిపిస్తే.. ఈ స్పీకర్‌తో.. వచ్చే వైర్‌ లెస్ మైక్రో ఫోన్ పెద్ద ప్లస్ పాయింట్. వేరే మైక్ కొనాల్సిన పని లేకుండా ..బాక్స్‌లోనే మైక్ రావడం వల్ల వెంటనే కరావోకే సెషన్ స్టార్ట్ చేయొచ్చు. అంతే కాదు, ఇందులో.. ఎకో కంట్రోల్, మైక్ వాల్యూమ్ కంట్రోల్‌తో పాటు 6.3mm మైక్ ఇన్‌పుట్ కూడా ఉంది. సింగింగ్, హోస్టింగ్, లేదా చిన్న ఈవెంట్లలో అనౌన్స్‌మెంట్స్ ఇవ్వడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

3. డైనమిక్ RGB లైట్లు & పోర్టబుల్ డిజైన్:

పార్టీ మూడ్ సెట్ అవ్వాలంటే ..సౌండ్‌తో పాటు లైటింగ్ కూడా ఉండాలి కదా. అయితే ఈ ఫ్రంట్ ప్యానెల్‌లో మ్యూజిక్ బీట్స్‌కు తగ్గట్టుగా వెలిగే డైనమిక్ స్ట్రోబ్ లైట్లు.. ఉన్నాయి. డిమ్ లైట్స్‌లో ఈ కలర్‌ ఫుల్ లైట్లు వేడుకకు.. మరింత వైబ్ తీసుకొస్తాయి. స్పీకర్‌పై బిల్ట్-ఇన్ క్యారీయింగ్ హ్యాండిల్ ,ఎల్ఈడీ డిస్‌ప్లే ఉండటం వల్ల.. ఒక చోటు.. నుంచి మరో చోటుకు.. ఈజీగా తీసుకెళ్లొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే..ఒక్క సారి ఛార్జ్ చేస్తే ..సుమారు 6 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది

4. కనెక్టివిటీ & TWS సపోర్ట్:

Advertisement

కనెక్టివిటీ పరంగా ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ లేదా ట్యాబ్ నుంచి వైర్‌ లెస్‌గా పాటలు స్ట్రీమ్ చేయడం వేగంగా, స్టేబుల్‌గా ఉంటుంది. దీంతో పాటు ..యూఎస్బీ టైప్-A పోర్ట్, 3.5mm ఇన్‌పుట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సౌండ్‌ని ఇంకా డబుల్ చేయాలనుకుంటే.. ఫీచర్ ద్వారా మరో సపోర్టెడ్ స్పీకర్‌ను.. ఈజీగా పెయిర్ చేసుకోవచ్చు.

Also Read: ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

5. ధర :

మార్కెట్లో ఈ మోడల్ బ్లూటూత్ పార్టీ స్పీకర్ ధర సుమారు రూ.6,999 గా ఉంది (సేల్స్, రిటైలర్ ఆఫర్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్ల ఆధారంగా.. ధరల్లో కొద్ది పాటి మార్పులు.. ఉండొచ్చు). ఫిలిప్స్ ఇదే లైనప్‌లో తక్కువ పవర్‌తో వచ్చే TAX2304/94 మోడల్‌ను సుమారు రూ.5,999 వద్ద కూడా అందిస్తోంది. బడ్జెట్‌లోనే.. 80W సౌండ్, వైర్‌ లెస్ మైక్, ఆర్జీబీ లైట్లు, బ్రాండ్ నమ్మకం కోరుకునేవారికి.. ఈ ఒక ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

మీరు రెగ్యులర్‌గా.. ఇంట్లో పార్టీలు, బర్త్‌డే.. ఫంక్షన్లు లేదా పాటలు పాడే.. అలవాటు ఉన్నవారైతే.. ఈ స్పీకర్ ఫీచర్లు మీ అవసరాలకు సరిగ్గా సరి పోతాయి. కొనే.. ముందు మీ రూమ్ సైజ్, బ్యాటరీ అవసరాలు, ప్రస్తుత ఆఫర్లను ఒక సారి చెక్ చేసుకుంటే.. బెస్ట్ డీల్ దొరుకుతుంది.

Related News

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

పక్షిలా కాళ్లపై పైకి గెంతి ఎగిరే డ్రోన్.. చూస్తే భలే ముచ్చటేస్తుంది

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీ..భారత్‌లో ఆపిల్ మ్యాప్స్ బిగ్ అప్‌డేట్

49 ఏళ్ల ప్రయాణం.. భూమి నుంచి ఒక లైట్ డే దూరంలో వాయేజర్ 1.. ఇంతకీ ఏమిటిది?

ఏఐ హెల్త్ అడ్వైస్..డాక్టర్ సలహా లేకుండా ఏఐని నమ్మి మోసపోకండి!

Big Stories

Advertisement
×