Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులకు ఏ రేంజ్ లో అయితే ఎంటర్టైన్మెంట్ అందిస్తోందో.. అదే రేంజిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ముఖ్యంగా టాస్కులలో సంచాలకుగా వ్యవహరించేవారు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిర్ణయాలను కలిసి తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు అంటూ నేటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 11వ వారానికి సంబంధించి టికెట్ టు ఫినాలే రేసు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ముఖేష్ , త్రిగుణ్ పోటీ పడగా.. త్రిగుణ్ రెండు రౌండ్లలో గెలిచి నేరుగా గ్రాండ్ ఫినాలే కి చేరుకున్నారు.
ఇక ఇప్పుడు మరో టాస్క్ లో భాగంగా సంచాలకులు ఫెయిల్ అవ్వడంతో డిక్టేటర్స్ కి ఆ అవకాశం కల్పించారు బిగ్ బాస్. డిక్టేటర్స్ గా ఉన్న ముఖేష్ , త్రిగుణ్ కూడా తమ పంతాన్ని వీడకపోవడంతో ఆ టాస్క్ ని బిగ్ బాస్ క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ డిక్టేటర్స్ పై మండిపడుతున్నారు.. విషయంలోకి వెళ్తే.. 11వ వారం 74వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో.. వంశీ, రాంప్రసాద్ కిచెన్ లో గ్యాస్ లైటర్ వెలిగించే ప్రయత్నం చేశారు. కానీ గ్యాస్ వెలగలేదు. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఇంటికి గుండె లాంటి కిచెన్ లో మంట ఎందుకు వెలగడం లేదో తెలుసా? అంటూ ప్రశ్నించారు. కంటెస్టెంట్స్ అందరూ ఇంట్లో ఫైర్ చూపించాలి అంటూ టాస్క్ గురించి మాట్లాడారు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్ లో ఉన్న ఇద్దరు డిక్టేటర్స్ కిచెన్ ఏరియాని తమ అధీనంలోకి తీసుకోవడానికి నేను ఇస్తున్న టాస్క్ పరుగులు ప్రశ్నలు అంటూ టాస్క్ నిర్వహించారు.
ఈ టాస్క్ లో శివ, వర్షిణి సంచాలకులుగా వ్యవహరించారు. ఆటలో భాగంగా ముఖేష్ టీం నుండి రామకృష్ణ, త్రిగుణ్ టీం నుండి వంశీ పోటీపడ్డారు. పింక్ వంశీ , బ్లూ రామకృష్ణ కార్డులతో గేమ్ ఆడారు. మధ్యలో వంశీ పడిపోవడం, ఆ తర్వాత రామకృష్ణ పడిపోవడం కాస్త భయంగా అనిపించినా ఏదోలాగా టాస్క్ పూర్తయింది. ఇద్దరు సంచాలకులుగా వ్యవహరించిన వర్షిణి, శివ తమ అభిప్రాయాలను చెప్పారు. ముందుగా వర్షిని మాట్లాడుతూ.. నేను పింక్ వన్ డిస్ క్వాలిఫై చేస్తున్నాను అని చెబుతుండగా.. శివ మధ్యలో కలగజేసుకొని మాట్లాడాడు. నీకు అసలు సెన్స్ ఉందా అంటూ వర్షిని శివపై ఫైర్ అయ్యింది.
also read:ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!
సంచాలకులుగా మీరిద్దరూ నిర్ణయం తీసుకోవడంలో.. విఫలమైనందున డిక్టేటర్స్ కి ఆ బాధ్యతను ఇస్తున్నాను అంటూ బిగ్ బాస్ తెలిపారు. ముఖేష్ 6 అండ్ 8 చెప్పగా.. త్రిగుణ్ పింక్ 5 ,బ్లూ 5 చెప్పాడు .ఇక ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక నిర్ణయాన్ని చెప్పండి అని బిగ్ బాస్ చెప్పిన ఇద్దరూ పంతంతో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ నిర్ణయానికి రావడంలో విఫలమైన నేపథ్యంలో టాస్క్ ను పూర్తిగా రద్దు చేస్తున్నాను అంటూ షాక్ ఇచ్చాడు. ఇలా ఈ ప్రోమో వైరల్ గా మారడంతో నిర్ణయం తీసుకోలేని మీరు విజేత ఎలా అవుతారు అంటూ ఆడియన్స్ కూడా మండిపడుతున్నారు