E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!
Advertisement

Meta Direct App: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే మెసేజింగ్ సదుపాయాన్ని ప్రత్యేక యాప్‌గా తీసుకొచ్చే పనిలో ఉంది. Direct పేరుతో కొత్త యాప్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేని వారు కూడా ఈ యాప్‌లో సైన్ అప్ చేసి ఇతరులతో చాటింగ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ చూడకుండా కేవలం మెసేజ్‌లు పంపుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడనుంది.

2013లో మొదలైన ఫీచర్..

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ మెసేజ్‌లు పంపుకునే సదుపాయం 2013లో మొదలైంది. అప్పట్లో కో-ఫౌండర్ కెవిన్ సిస్ట్రోమ్ దీన్ని పరిచయం చేశారు. ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను వ్యక్తిగతంగా లేదా గ్రూపుల్లో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడింది. ఇప్పుడు అదే మెసేజింగ్ వ్యవస్థను ప్రత్యేక యాప్‌గా మార్చాలని మెటా చూస్తోంది. గతంలో ఫేస్‌బుక్ మెసేజింగ్‌ను మెసెంజర్‌గా విడిగా తీసుకొచ్చిన తరహాలోనే ఈ ప్రయత్నం కనిపిస్తోంది.

చాటింగ్ కోసం ప్రత్యేక యాప్..

Advertisement

Direct యాప్‌లో ఇద్దరు వ్యక్తులు నేరుగా మాట్లాడుకోవచ్చు. అలాగే గ్రూప్ చాట్‌లు కూడా చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లలో ఉన్న డ్రా, నోట్స్, స్టిక్కర్లు, వాయిస్ ఎఫెక్ట్స్, థీమ్స్ వంటి ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి. చాట్‌లోనే బొమ్మలు గీయడం, చిన్న అప్‌డేట్స్ పెట్టడం, స్టిక్కర్లతో మెసేజ్‌లను మరింత సరదాగా మార్చడం వంటివి చేయొచ్చు. ఫీడ్‌లో సమయం గడపకుండా స్నేహితులతో మాట్లాడాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చు.

Also Read: మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!

అకౌంట్ లేకుండానే సైన్ అప్..

Advertisement

ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్‌ను పరీక్షిస్తున్నారు. అయితే టర్కీ, థాయ్‌లాండ్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవారు అదే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావచ్చు. రెండు యాప్‌లలోని చాట్‌లు ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. అకౌంట్ లేని వారు ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్‌తో కొత్తగా చేరవచ్చు. ఇతరులను యూజర్‌నేమ్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

ప్రైవసీకి ప్రాధాన్యం..

తెలియని వ్యక్తులు నేరుగా మెసేజ్‌లు పంపకుండా కాంటాక్ట్స్, ఇప్పటికే పరిచయం ఉన్నవారికే అవకాశం ఉంటుంది. అవసరమైతే బ్లాక్, రిపోర్ట్, రిస్ట్రిక్ట్ చేయొచ్చు. యువతకు సంబంధించిన అనుచిత చాటింగ్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటామని మెటా చెబుతోంది. ఈ యాప్ వాడాలంటే కనీసం 13 ఏళ్లు నిండి ఉండాలి. పరీక్షలు పూర్తయ్యాక మరిన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తుందా అనేది చూడాలి.

Also Read: కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

పక్షిలా కాళ్లపై పైకి గెంతి ఎగిరే డ్రోన్.. చూస్తే భలే ముచ్చటేస్తుంది

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీ..భారత్‌లో ఆపిల్ మ్యాప్స్ బిగ్ అప్‌డేట్

49 ఏళ్ల ప్రయాణం.. భూమి నుంచి ఒక లైట్ డే దూరంలో వాయేజర్ 1.. ఇంతకీ ఏమిటిది?

Big Stories

Advertisement
×