E-Paper
Advertisement

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు
Advertisement

Midea 6.5 kg washing machine: రోజూ బట్టలు ఉతకడం అంటే.. చాలా మందికి పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీలో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు లేదా ఆఫీస్, కాలేజీ హడావిడిలో ఉన్నప్పుడు టైమ్ సేవ్ చేసే వాషింగ్ మెషిన్ ఉంటే పని చాలా ఈజీ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి కెపాసిటీ, ప్రాక్టికల్ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ వాషింగ్ మెషీన్ సుమారు రూ.8,299 ధర వద్ద అందుబాటులో ఉంది. స్టైలిష్ మెరూన్, వైట్ కలర్ కాంబినేషన్‌తో ..వచ్చే ఈ మోడల్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు మార్కెట్లో ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పాటు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. నీటి ఖర్చుపై మనకు పూర్తి కంట్రోల్ ఉండటం, తక్కువ మెయింటెనెన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వంటి కారణాలతో ఎంతో మంది వీటిని ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో Midea బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ చిన్న, మీడియం ఫ్యామిలీల అవసరాలకు తగ్గట్టుగా తయారైంది.

పూర్తి ఫీచర్లు:

1. 6.5 kg కెపాసిటీ:

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ 6.5 kg కెపాసిటీతో వస్తుంది. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలు లేదా రోజు వారి రెగ్యులర్ వాడకానికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ డిజైన్ కావడం వల్ల వాష్ టబ్, స్పిన్ టబ్ వేర్వేరుగా ఉంటాయి. బట్టలపై ఉండే.. మురికిని ఈజీగా తొలగించేందుకు వాషింగ్ యాక్షన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్పిన్ సైకిల్ ద్వారా బట్టల్లోని అదనపు నీటిని వేగంగా బయటకు పంపి, బట్టలు త్వరగా ఆరేందుకు హెల్ప్ చేస్తుంది.

2. మెరూన్, వైట్ డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:

లుక్ పరంగా చూస్తే మెరూన్, వైట్ కలర్ కాంబినేషన్ చూడటానికి నీట్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. బాత్రూమ్ లేదా వాష్ ఏరియాలో.. ఎక్కడ పెట్టినా ఇట్టే సెట్ అయిపోతుంది. ఈ సెగ్మెంట్‌లోని మిడియా సెమీ ఆటోమేటిక్ మోడల్స్‌లో సాధారణంగా.. తుప్పు పట్టని బాడీ, తేలికగా తిప్పగలిగే కంట్రోల్ నాబ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. నీరు, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో వాడే డివైజ్ కాబట్టి ఈ బిల్డ్ క్వాలిటీ రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Also Read: ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

3. ప్రాక్టికల్ యూసేజ్ :

సెమీ ఆటో మేటిక్ వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు నీటి స్థాయిని మనమే సెట్ చేసుకోవచ్చు. కాబట్టి.. తక్కువ నీటితో చిన్న లోడ్ బట్టలను కూడా వేస్ట్ చేయకుండా ఉతకడానికి వీలుంటుంది. పవర్ కట్ లేదా వోల్టేజ్ మారుతూ ఉండే ప్రాంతాల్లో సేఫ్టీ ఫీచర్లు ఉన్న మోడల్స్ వాడటం మంచిది. బట్టలు ఉతికేటప్పుడు దారాలు, లింట్ పేరుకుపోకుండా ఫిల్టర్ వ్యవస్థ ఉన్న మోడల్స్ బట్టల క్లీన్‌నెస్‌ని మెరుగుపరుస్తాయి.

4. ధర:

ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.8,299 గా ఉంది. ఆన్‌లైన్ సేల్స్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా లోకల్ స్టోర్ డిస్కౌంట్లను బట్టి మారే అవకాశం కూడా ఉంటుంది.

Related News

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

Big Stories

Advertisement
×