BigTV English

BHIM 3.0​: భీమ్ యూపీఐ కొత్త వెర్షన్..మరింత ఫాస్ట్, మరిన్ని కొత్త ఫీచర్లు

BHIM 3.0​: భీమ్ యూపీఐ కొత్త వెర్షన్..మరింత ఫాస్ట్, మరిన్ని కొత్త ఫీచర్లు

BHIM 3.0​: UPI చెల్లింపులు ఇక మరింత వేగంగా, సురక్షితంగా జరగనున్నాయి. ఎందుకంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) BHIM యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మంగళవారం విడుదలైన ఈ కొత్త వెర్షన్‌కు BHIM 3.0 అని పేరు పెట్టారు. కొత్త అప్‌డేట్‌తో, UPI చెల్లింపులను నిర్వహించడం ఇంకా సులభమవుతుంది. అంతేకాదు BHIM 3.0 ద్వారా వినియోగదారులు తమ ఖర్చులను ట్రాక్ చేయడమే కాకుండా, వాటిని వర్గీకరించుకొని మంచి ఆర్థిక నియంత్రణ పొందవచ్చు. NPCI ప్రకారం, ఈ మార్పులు త్వరలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి.


పూర్తిగా అందుబాటులోకి ఎప్పుడంటే..
ఈ కొత్త వెర్షన్ ఏప్రిల్ 2025 ప్రారంభం నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. BHIM 3.0 15కి పైగా భాషల్లో తీసుకొస్తున్నారు. ఇందులో తెలుగు కూడా ఒకటి. ఇంకా, ఇంటర్నెట్ వేగం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా చెల్లింపులు సులభంగా చేయడానికి ఇది సహాయపడుతుంది.

కుటుంబ సభ్యులను కూడా
BHIM 3.0 డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు వారి నెలవారీ ఖర్చులను ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతోందో తెలుసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మరింత ఈజీ అవుతుంది. BHIM 3.0లో మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, మీ కుటుంబ సభ్యులను కూడా UPI ఖాతాకు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీ కుటుంబ సభ్యుల ఖర్చులను ట్రాక్ చేయడమే కాకుండా, వారికి చెల్లింపు బాధ్యతలు అప్పగించవచ్చు.


Read Also: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్.. 

ఎవరు చెల్లించాలనే విషయాలను
ఉదాహరణకు, ఇంటి కరెంట్ బిల్ చెల్లించేది ఎవరు, ఇంటర్నెట్ బిల్ ఎవరు చెల్లించాలనే పనులను భద్రతతో నిర్వహించుకోవచ్చు. ఈ అప్‌గ్రేడ్‌తో UPI లావాదేవీలు మరింత పారదర్శకంగా మారతాయి. అంతేకాకుండా, పెండింగ్ బిల్స్ కోసం రిమైండర్స్ కూడా వస్తాయి. అంటే ఏ బిల్ కూడా మర్చిపోవడానికి అవకాశం ఉండదు. మీ UPI LITE బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.

వ్యాపారులకు కొత్త BHIM వేగా
వ్యాపారుల కోసం BHIM వేగా అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో వ్యాపారులు యాప్ నుంచి బయటకు వెళ్లకుండా చెల్లింపులు స్వీకరించగలుగుతారు. దీని వల్ల వారి వ్యాపార లావాదేవీలు వేగంగా, సులభంగా పూర్తవుతాయి.

BHIM 3.0తో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
-15+ భాషల్లో లభ్యం – తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో సపోర్ట్
-ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్లు చేయొచ్చు
-నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయడం చాలా సులభం
-కుటుంబ ఖర్చులను ఒకే చోట చూసుకోవచ్చు
-వ్యాపారులకు ప్రత్యేకమైన BHIM వేగా
-పెండింగ్ బిల్లుల రిమైండర్‌లు – ఏ బిల్ మర్చిపోకుండా టైమ్‌కి చెల్లించొచ్చు

ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కొత్త దశ
ఇప్పటి వరకూ UPI చెల్లింపులు తక్షణమే జరిగేవి, కానీ ఖర్చులను ట్రాక్ చేయడం అంత సులభం కాదు. ఇప్పుడు BHIM 3.0తో మీ మొత్తం ఖర్చులను పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇంకా BHIM యాప్‌ని అప్‌డేట్ చేసుకోలేదా. లేదంటే ఇప్పుడే చేసుకోండి. ఈ కొత్త అప్‌డేట్‌తో మీ ఫైనాన్స్‌ విషయాలను సులభంగా, సమర్థంగా నిర్వహించుకోవచ్చు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×