Health Insurance: ఇటీవల, ఆరోగ్య బీమా ప్రీమియం భారీగా పెరుగుతోంది. దీంతో అనేక మంది ఎందుకు పెరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం తమ పాలసీలను రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ప్రీమియం మొత్తం పెరగడానికి కేవలం వయస్సు, ఆరోగ్య స్థితి మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుుతున్నారు. ఇది మీరు నివసించే నగరంతో కూడా సంబంధం కలిగి ఉంటుందన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆరోగ్య బీమా ప్రీమియాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలు
బీమా ప్రీమియం కేవలం వయస్సు, ఆరోగ్య చరిత్ర, బీమా కవరేజ్ వంటి అంశాలపై మాత్రమే ఆధారపడదని బీమా నిపుణులు నిఖిల్ ఝా అన్నారు. మీరు నివసించే నగరం కూడా దీనిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారతదేశంలో బీమా సంస్థలు నగరాలను వివిధ ఆర్థిక, వైద్య ఖర్చుల ప్రమాణాలు, క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ లాంటి అంశాల ఆధారంగా జోన్‌లుగా విభజించాయి.
ప్రధానంగా ప్రీమియాన్ని ప్రభావితం చేసే అంశాలు:
-మీ వయస్సు & ఆరోగ్య పరిస్థితి
-బీమా పాలసీ మొత్తం (Coverage)
-వైద్య సేవల ఖర్చు
-క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ
-మీరు నివసించే నగరం
-మీ నగరం ఏ జోన్‌లో వస్తుందో తెలుసుకుంటే, మీ బీమా ఖర్చులను ముందుగానే అంచనా వేసుకోవచ్చు.
మెట్రో నగరాల్లో అధిక ప్రీమియాలు ఎందుకంటే?
మీరు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఉంటే ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెట్రో నగరాల్లో ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
Read Also: Ugadi Special Offer: ఉగాది ప్రత్యేక ఆఫర్..రూ.4 వేలకే …
నగరాల ఆధారంగా జోన్ల విభజన
-జోన్ A (అధిక ప్రీమియం): ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్
-జోన్ B (మధ్యస్థ ప్రీమియం): టైర్-1, టైర్-2 నగరాలు
-జోన్ C (తక్కువ ప్రీమియం): టైర్-3 నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు
నగరం ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
-మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖరీదుగా ఉండటం
-జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ & వ్యాధుల వ్యాప్తి అధికం
-జీవనశైలి వ్యాధులు ఎక్కువగా ఉండడం (బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు)
-మెట్రో నగరాల్లో తీవ్రమైన కాలుష్యం ఆరోగ్య సమస్యలకు కారణం
-ఈ కారణాల వల్ల క్లెయిమ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, బీమా ప్రీమియం కూడా పెరుగుతోంది.
ఆరోగ్య బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి చిట్కాలు
-మీ ఆరోగ్య బీమా ఖర్చులను తగ్గించుకోవడానికి కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి.
-సరైన జోన్ & పాలసీని ఎంచుకోవడం
-మీరు చిన్న పట్టణాల్లో ఉంటే, మెట్రో నగరాలకు చెందిన బీమా పాలసీలను తీసుకోకూడదు. మీ ప్రస్తుత నివాసానికి అనుగుణంగా సరైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
వివిధ కంపెనీల ప్లాన్లను పోల్చడం
-ప్రీమియం రేట్లు మాత్రమే కాకుండా కవరేజ్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ కూడా చూడండి.
-స్టార్ హెల్త్, అపోలో మ్యూచువల్, హెడెల్‌వైజ్, బజాజ్ అలియాంజ్ వంటి కంపెనీల బీమా ప్లాన్లను పోల్చి ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి
ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం
-వ్యాయామం & ఆరోగ్యకరమైన ఆహారం వల్ల రోగాలు తగ్గుతాయి
-చాలా కంపెనీలు హెల్త్ & ఫిట్‌నెస్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
బీమా పాలసీని ప్రతి సంవత్సరం పునఃసమీక్షించండి
మీ ఆరోగ్య పరిస్థితి & అవసరాలు మారుతుంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మీ పాలసీని రివ్యూచేసి, అవసరమైన మార్పులు చేసుకోండి