Olympics 2032: ప్రపంచంలో క్రికెట్ కి సంబంధించి అత్యంత ప్రసిద్ధిగాంచిన స్టేడియాలలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ “గబ్బా” స్టేడియం ఒకటి. ఈ స్టేడియానికి సుమారు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1895 లో ఈ స్టేడియన్ని నిర్మించారు. ఈ స్టేడియం దశాబ్దాలుగా ఆస్ట్రేలియా క్రికెట్ కోటగా నిలిచి.. ఎన్నో చిరస్మరణీయ విజయాలకు వేదిక అయింది. అలాంటి ఈ మైదానాన్ని 2032 ఒలంపిక్స్ తర్వాత కూల్చివేయనున్నారు. ఈ విషయాన్ని క్వీన్స్ల్యాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆటగాళ్ల భద్రతకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Rishabh Pant: రూ. 27 కోట్లు తీసుకుని ఒక్క స్టంప్ చేయలేదు.. పంత్ పై ట్రోలింగ్ !
ఈ స్టేడియం శిధిలావస్థకు చేరుకుందని క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే స్టేడియం వయస్సు కారణంగా పునర్నిర్మాణ ఖర్చులు భారీగా ఉండడంతో కొత్త స్టేడియం నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు.. ఈ స్టేడియాన్ని నిర్మించి సుమారు 100 ఏళ్లకు పైగా అయ్యింది.
స్టేడియం పునర్నిర్మాణ ఖర్చులు భారీగా కానున్న నేపథ్యంలో స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేసి.. కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. 2032 ఒలంపిక్ క్రీడలకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా ఆధునిక మైదానాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీని స్థానంలో విక్టోరియా పార్క్ లో సుమారు 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించాలని క్వీన్స్ లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
2032 ఒలంపిక్స్ {Olympics 2032} కోసం కొత్తగా నిర్మించే విక్టోరియా పార్క్ స్టేడియం ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రధాన వేదిక కానుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోనే అత్యంత ఆధునిక మైదానాలలో ఒకటిగా ఈ స్టేడియం రూపొందనుంది. ఇక ఈ గబ్బా స్టేడియం పూర్తిగా మూతపడే వరకు ఇక్కడ కొన్ని ప్రధాన ఈవెంట్లను నిర్వహించనున్నారు. 2025 యాషష్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్, అలాగే 2032 ఒలంపిక్స్ లో కొన్ని పోటీలు, గోల్డ్ మెడల్ మ్యాచ్ లు, వేసవికాలంలో జరిగే కొన్ని వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో జరగబోతున్నాయి.
Also Read: Rahul Athiya Blessed with baby Girl: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా క్రికెటర్…!
ఇక ఈ మైదానం కూల్చివేత, నూతన మైదానం నిర్మాణానికి ఆస్ట్రేలియా $ 2.7 బిలియన్లను కేటాయించింది. కానీ ఈ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్రణాళికలు సవరించింది. ప్రారంభంలో గబ్బర్ స్టేడియం నిరుద్ధరణ కోసం 600 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను ఖర్చు చేయాలని భావించింది. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీర్చుకొని కొత్తగా విక్టోరియా పార్క్ స్టేడియం ప్రాజెక్ట్ ని ఆమోదించింది. ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండడంతో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.