ChatGpt : ప్రముఖ AI ఆధారిత సర్వీస్ ఫ్లాట్ఫామ్ చాట్‌బాట్ ఆగిపోయింది. ChatGPTలో సాంకేతిక సమస్య కారణంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్స్ ను గందరగోళంలో పడేసింది. ఈ అంతరాయం OpenAI తో పనిచేసే API, ఇతర సేవలను కూడా ప్రభావితం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ChatGPT సేవలు డౌన్ కావడంతో వినియోగదారుల నుంచి గణనీయంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే 1000 కంటే ఎక్కువ నివేదికలు వచ్చినట్టు తెలుస్తుంది. ఓపెన్ ఏఐ సేవలు ఆగిపోవడంతో దీనిపై ఆధారపడిన ఎందరో వినియోగదారులు గందరగోళంలో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు సైతం పెడుతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి, చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
చాట్ జీపీటీ డౌన్ కావటంపై సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా పేలుతున్నాయి. “మా హిస్టరీ మొత్తం చాట్ జీపీటీ చేతిలోనే ఉంది. తిరిగి మళ్ళీ మా హిస్టరీ మాకు ఇచ్చేయండి..” అంటూ నెటిజన్స్ మీమ్స్ పెడుతున్నారు. అంతేకాకుండా “మా రెండో బ్రెయిన్ పనిచేయకుండా ఆగిపోయింది.. చాట్ జీపీటీ డౌన్ అయింది..” అంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక వ్యక్తిగత వినియోగదారులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు సైతం ఓపెన్ ఏఐపై ఆధారపడి పనిచేస్తున్నాయి. అనేక వ్యాపార లావాదేవీలను నిర్వహించే సంస్థలు తమ సేవలకు అంతరాయం ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గత నెలలో సైతం చాట్ జీపీటీ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్పుడు సైతం ఇదే రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఇదే రకమైన ఇబ్బంది ఎదురైంది. ఇక నెల రోజుల వ్యవధిలో మూడోసారి ఈ సేవల్లో అంతరాయం రావడంతో వినియోగదారులు వరుస కంప్లైంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ఓలా, ఉబర్ కు ఝలక్.. అలా ఎందుకు చేస్తున్నారో తెలపాలంటూ కేంద్రం నోటీసులు