BigTV English

Best Budget Laptops Under Rs 15000: చీపెస్ట్ ల్యాప్‌టాప్స్.. 5జీ ఫోన్ ధరకే కొనేయొచ్చు, ఫీచర్లు అదిరిపోయాయ్!

Best Budget Laptops Under Rs 15000: చీపెస్ట్ ల్యాప్‌టాప్స్.. 5జీ ఫోన్ ధరకే కొనేయొచ్చు, ఫీచర్లు అదిరిపోయాయ్!

Cheapest Laptops: చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు అందరికీ ఉపయోగమే. ఉద్యోగం చేసేవారు వారి ప్రొజెక్టుల కోసం.. అదే సమయంలో చదువుకునే పిల్లలు తమ అసైన్‌మెంట్ కోసం ఎక్కువగా ల్యాప్‌టాప్‌లను యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా కరోనా కష్టకాలం తర్వాత వర్క్ ఫ్రమ్ హోం కంపెనీలు ఎక్కువైపోయాయి. అందువల్ల ఇంటిదగ్గరి నుంచి వర్క్ చేసేవారికి ఎక్కువగా ల్యాప్‌టాప్ అవసరం.


కానీ ల్యాప్‌టాప్‌లకు ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. అందువల్ల చాలామంది సామాన్యులకు భారంగా మారింది. అయితే అలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు కూడా ఒక మంచి ల్యాప్‌టాప్‌ను అతి తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ కేవలం రూ.15,000 లోపే అద్భుతమైన ఫీచర్లు గల ల్యాప్‌లాప్‌ను అందుబాటులో ఉంచింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Walker Thin & Light Laptop


వాకర్ థిన్ & లైట్ ల్యాప్‌టాప్ అతి పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 1920 x 1080 రిజల్యూషన్‌తో 14.1-అంగుళాల FHD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఏ వర్క్‌కైనా ఇది శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. జెమినీ లేక్ N4020 ప్రాసెసర్ ద్వారా ఆధారితం అయింది. UHD గ్రాఫిక్స్ 600తో అమర్చబడింది. ఇది రోజువారీ కంప్యూటింగ్ అవసరాలకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 4GB RAM + 128GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది.

HP Chromebook (2024)

Also Read: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

HP Chromebook (2024) రోజువారీ పనులకు అత్యంత ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది. ఇది ఒక కాంపాక్ట్, తేలికైనది. కేవలం 1.34 కిలోల బరువు ఉంటుంది. ప్రయాణంలో ఉన్న విద్యార్థులు, నిపుణుల కోసం రూపొందించబడింది. ఇది MediaTek MT8183 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 11.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అందువల్ల ఒక మంచి ఫీచర్లు గల ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.15000 తీసుకోవాలనుకుంటే ఇవే బెస్ట్. పలు ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు.

Primebook 4G 2024

అత్యంత స్లిమ్ అండ్ తేలికైన ల్యాప్‌టాప్‌లలో ప్రైమ్‌బుక్ 4G (2024) ఒకటి. ఇందులో 11.6 అంగుళాల డిస్‌ప్లే అందించారు. ఇది కేవలం 1.065 కిలోల బరువు ఉంటుంది. MediaTek MT8788 ప్రాసెసర్ ద్వారా ఆధారితం అయింది. ప్రైమ్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ వర్క్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటికీ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది 4GB RAM + 64GB eMMC స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

FUTOPIA ULTIMUS PRO

FUTOPIA ULTIMUS PRO (2024) ల్యాప్‌టాప్ కూడా అమెజాన్‌లో తక్కువ ధరకు లభిస్తుంది. దీని ధర అధికంగా ఉన్నా.. ఇప్పుడు రూ.15 వేల లోపే కొనేయొచ్చు. ఇది 1.30 కిలోల బరువు ఉంటుంది. 2.8 GHz వేగంతో ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఆధారితం అయింది. ఇక దీని ర్యామ్, స్టోరేజ్ విషయానికొస్తే.. ఇది 4GB RAMతో సాఫీగా మల్టీ టాస్కింగ్‌ని నిర్ధారిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14.1 అంగుళాల HD డిస్‌ప్లే, ఇంటెల్ HD గ్రాఫిక్‌లను కలిగి ఉంది. అలాగే ఇది వర్క్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం క్వాలిటీ గల విజువల్స్‌ను అందిస్తుంది.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×