BigTV English

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Turmeric For Skin: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఇది చాలా మేలు చేస్తుంది. శతాబ్దాలుగా పసుపు, శనగ పిండిని చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల చర్మం కాంతివంతంగా మారడంతో పాటు స్మూత్‌గా మారుతుంది.


పసుపును అమ్మమ్మల కాలం నుంచి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖం రంగు కోల్పోవడం వెనుక కారణం ఏదైనా కావచ్చు, కానీ అలాంటి సమయంలో పసుపును ఉపయోగిస్తే తిరిగి ఫేస్ రంగు మారుతుంది.

పసుపును రెగ్యులర్‌గా ఫేస్‌కు ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. పసుపుతో శనగపండి, పాలు, తేనెలను కలిపి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకుని ముఖానికి వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపుతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పసుపుతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేయాలి ?
1. పసుపు, పాలతో ఫేస్ ప్యాక్..

పసుపు -1 టీస్పూన్
పాలు -2 టీస్పూన్లు

తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో పసుపు, పాలను తీసుకుని ఒక బౌల్ లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఈ రెమెడీ మొటిమలు , మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

2. పసుపు, శనగపిండి ఫేస్ ప్యాక్..
పసుపు పొడి- 1 టీస్పూన్
శనగపిండి- 1టీస్పూన్

తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదుల్లో పసుపు, శనగపిండిని ఒక బౌల్ లో తీసుకుని బాగా కలపాలి. చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. అనంతరం చల్లటి నీటితో కడగండి . ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి మెరుపును అందిస్తుంది.

Also Read: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

3. పసుపు, తేనె ఫేస్ ప్యాక్..

పసుపు పొడి- 1 టీస్పూన్
తేనె -1 టీస్పూన్

తయారీ విధానం:
ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో పసుపు, తేనెను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై రాయండి. తర్వాత 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత దీనిని కడిగేయండి. ఇది చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మానికి పోషణనిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తరుచుగా ఈ ఫేస్ వాడటం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Flax Seeds: మహిళలు ఫ్లాక్ సీడ్స్ తింటే. ?

Tips For Long Hair: జుట్టు తొందరగా పెరగాలంటే ?

Shrunken Heads: తలలు నరికి, పుర్రెపై చర్మాన్ని ఒలిచి.. చనిపోయేవాళ్లను ఇక్కడ ఇలాగే చేస్తారు, ఎందుకంటే?

Weight Loss: బరువు తగ్గాలా ? అయితే రాత్రిపూట ఇవి అస్సలు తినొద్దు !

Kidney Health: వీటికి దూరంగా ఉంటేనే.. మీ కిడ్నీలు సేఫ్

Fatty Liver Disease: మహిళలకు ఫ్యాటీ లివర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు

Big Stories

×