BigTV English

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

అంతరిక్షంలో ఏదైనా కొత్త నిర్మాణం చేపట్టాలంటే చాలా కష్టం. స్పేస్ స్టేషన్ వంటి వాటిని కూడా ఒకేసారి ఏర్పాటు చేయలేం. వాటికి సంబంధించిన పరికరాలను ఒక్కోదఫా అంతరిక్షంలోకి తీసుకెళ్లి నిర్మాణాలను పూర్తి చేస్తుంటారు. వాటిని విస్తరించుకుంటారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని భూమిపైనుంచి తీసుకెళ్తే సరిపోతుంది. మరి అంతరిక్షంలోనే ఇళ్లు కట్టి కాలనీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి. దానికి సంబంధించిన మెటీరియల్ ని అంతరిక్షం లోనే తయారు చేసుకోవాలి. రేపు చంద్రుడిపై ఇల్లు కట్టాలన్నా ఇదే టెక్నాలజీ అవసరపడుతుంది. చంద్రుడిపైనే ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టుకోవాలి. ఆ దిశగా ఇప్పుడు చైనా ముందడుగు వేసింది.


అంతరిక్షంలో పంటలు..
ఆ ఆమధ్య అంతరిక్షంలో వరి పండించి చైనా ఓ అద్భుతాన్ని సృష్టించింది. అంతరిక్ష యాత్రికులు ఇక్కడ్నుంచి ఆహార పదార్థాలను తీసుకెళ్లే అవసరం లేకుండా అక్కడే వారికోసం వారే పంటలు పండించుకునే ప్రయోగాన్ని విజయవంతం చేశారు చైనా శాస్త్రవేత్తలు. వారే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. చంద్రుడిపై ఇల్లు కట్టుకోడానికి అక్కడే ఇటుకలు తయారు చేసే మెషిన్ ని సిద్ధం చేశారు. చంద్రుడిపై ఉన్న ధూళిని వినియోగించుకుని ఈ ఇటుకలు తయారు చేయడం ఆ మెషిన్ స్పెషాలిటీ.

త్రీడీ ప్రింటర్..
అంతరిక్షంలో ఇల్లు కట్టేందుకు ఇటుకలు తయారు చేసే పరికరం ఒక త్రీడి ప్రింటర్ లా పనిచేస్తుందని అంటున్నారు. అంతరిక్షంలోని ధూళిని ముడిసరుకుగా ఇది ఉపయోగించుకుంటుంది. దీనికి అవసరమైన శక్తిని సూర్యుడి నుంచి పొందుతుంది. సూర్యరశ్మిని 3వేల రెట్లు ఎక్కువ కాన్సన్ ట్రేషన్ కు చేర్చి, దాని ద్వారా 1300 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పొందడం ఈ మెషన్ స్పెషాలిటీ. ఆ ఉష్ణోగ్రత వద్ద చంద్రుడి ధూళిని ఇది ద్రవపదార్థంలా మార్చి ఇటుకలను తయారు చేస్తుంది.


చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో ఉన్న హెఫీలో చైనా డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ లాబొరేటరీ (DSEL) ఈ కీలక పరిశోధన చేపట్టింది. చంద్రునిపై వదులుగా ఉన్న ఉపరితలాన్ని రెగోలిత్‌ అంటారు. ఇక్కడ్నుంచి తీసుకున్న ధూళితో ఇటుకలను తయారు చేస్తారు. చంద్రుడిపై కాలనీలు నిర్మించడానికి భూమిపైనుంచి మెటీరియల్ తీసుకెళ్లకుండా అక్కడే దాన్ని తయారు చేసుకోవడం ఒక పెద్ద సవాలుగా ఇప్పటి వరకు అనిపించేది. దాన్ని చైనా శాస్త్రవేత్తలు పరిష్కరించగలిగారు. భవిష్యత్ లో చంద్రుడిపై స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఈ బ్రిక్ మేకింగ్ మిషన్ బాగా ఉపయోగపడుతుందట. రెండేళ్లపాటు కష్టపడి ఈ మెషిన్ ని తయారు చేశారు. ప్రాథమిక దశలో ఈ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.

గతేడాది నవంబర్ లో చైనా స్పేస్ స్టేషన్ కి ఈ నమూనా ఇటుకలను పంపించారని, అక్కడ వాటి సామర్థ్యాన్ని ప్రాథమికంగా పరీక్షించారని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం ఇల్లు కట్టేందుకే కాదు, ఈ ఇటుకలు రోడ్లు నిర్మించేందుకు కూడా పనికొస్తాయని చెబుతున్నారు. ఇతర నిర్మాణాలకు కూడా వీటినే ఉపయోగిస్తారట. మొత్తానికి చంద్రుడిపై ఇల్లు కట్టాలంటే చైనా మెషిన్ తయారీ ఇటుకలనే అంతరిక్షంలో కొనుగోలు చేయాల్సి వస్తుందనమాట.

Related News

iQOO Z10 4G: 6,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త iQOO Z10 4G.. ఫీచర్లు ఏంటో చూడండి!

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Big Stories

×