BigTV English

DeepSeek : కోట్లలో డీప్​సీక్ డౌన్లోడ్స్.. సరే కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?

DeepSeek : కోట్లలో డీప్​సీక్ డౌన్లోడ్స్.. సరే కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?

DeepSeek :  చైనా ఏఐ స్టార్టప్‌ ‘డీప్‌సీక్‌’ ప్లేస్టోర్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే అమెరికా ఫ్రీ యాప్స్ జాబితాలో తొలి స్థానంలో నిలించిన ఈ స్టార్టప్.. ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల్లో యాప్ స్టోర్ లో టాప్ 10లో నిలిచింది. ఏఐ ఫ్లాట్ఫమ్ చాట్ జీపీటీను వెనక్కి నెట్టి డీప్​సీక్ ముందు వరుసలో నిలిచింది.


ప్లే స్టోర్ లో డీప్​సీక్ దూసుకుపోతుంది. తాజాగా R1 మోడల్ విడుదల చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ స్టార్టప్ సంస్థ.. అటు డౌన్లోడ్స్ లోనూ తన హావా చూపిస్తోంది. యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికే అగ్రస్థానంలో నిలుస్తున్న డీప్​సీక్.. గూగుల్ ప్లే స్టోర్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్ ఫ్రీ యాప్స్ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన డీప్​సీక్… ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీను రెండో స్థానానికి నెట్టేసింది.

ప్రపంచవ్యాప్తంగా డీప్​సీక్ హవా కనిపిస్తుంది. ఒక అమెరికాలో మాత్రమే కాకుండా దాదాపు 51 దేశాల్లో ప్లేస్టోర్ లో ఈ యాప్ అగ్రస్థానంలో ఉంది. 111 దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్స్ లో.. 18 దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 10 జాబితాలో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ లో సైతం కోటికి పైగా డౌన్లోడ్ జరగగా.. డీప్ సీక్ మొత్తం డౌన్లోడ్స్ లో 80% గడిచిన వారంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఇక మెత్తం డౌన్లోడ్స్ లో 23% చైనా వాటా ఉన్నట్టు సమాచారం.


ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్స్ ను ఆకర్షిస్తున్న డీప్ సీక్ మూలాలు చైనాలో ఉండటం పలు సందేహాలకు దారి తీస్తుంది. ఇప్పటికే యూజర్స్ అడిగిన పలు ప్రశ్నలకు తన పరిధి దాటి ఉన్నాయంటూ మాట దాటే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. డీప్ సీక్ కేవలం 30 నిమిషాల్లో పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరించింది. కానీ చైనాకు చెందిన పలు అంశాల విషయంలో మాత్రం దాటివేసే ధోరణి చేపడుతుంది.

ALSO READ : ఇండియాలో కోట్లలో మెుబైల్ మార్కెట్.. ఆ ఫోన్స్ ఏ టాప్

ప్రపంచ దేశాలకు ఇప్పటికీ ఓ ప్రశ్నగా మిగిలిపోయిన 1989 తియాన్మెన్ స్క్వేర్  ఘటన పై ఓ నెటిజన్ డీప్​సీక్ ను ప్రశ్నించాడు. “ఆరోజు ఏం జరిగింది” అంటూ ప్రశ్నించగా “ప్రస్తుతానికి ఇది నా పరిధిలో లేని అంశం.. వేరే ప్రశ్నలు అడగండి” అంటూ మాట దాటివేసింది. ఇక మరోసారి ప్రయత్నించిన యూజర్.. “19898 జూన్ 3 సాయంత్రం, జూన్ 4 ఉదయం తియాన్మెన్ స్క్వేర్ వద్ద ఏం జరిగింది..” అంటూ ప్రశ్నించగా మళ్లీ అదే విధంగా సమాధానం ఇచ్చింది.

1989లో తియాన్మెన్ స్క్వేర్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో పదివేల మందికి పైగా మరణించారని సమాచారం. వేలమంది అభాగ్యులపై సైన్యం ట్యాంకులతో విరుచుకుపడటంతో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇలాంటి ఊచకోతపై డీప్​సీక్ స్పందించలేదు. ఇక ఈ ప్రశ్నలు మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన పలు ప్రశ్నలపై సైతం డీప్​సీక్ దాటివేసే ప్రయత్నం చేస్తుంది. “అరుణాచల్ ప్రదేశ్ ఏ దేశానికి చెందిన రాష్ట్రం” అని ప్రశ్నించగా… “ఇది నా పరిధిలో లేని అంశం” అంటూ దాటివేసే ధోరణి చేపట్టింది. ఇవేకాకుండా బీజింగ్, తైవాన్ కు సంబంధించిన పలు విషయాలపై సైతం డీప్​సీక్ స్పందించలేదు. ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల పేర్లు అడిగినా సమాధానం ఇవ్వని డీప్​సీక్ పై ఇప్పుడు ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

 

Tags

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×