E-Paper
Advertisement

Apple : ఇండియాలో కోట్లలో మెుబైల్ మార్కెట్.. ఆ ఫోన్స్ ఏ టాప్

Apple : ఇండియాలో కోట్లలో మెుబైల్ మార్కెట్.. ఆ ఫోన్స్ ఏ టాప్
Advertisement

Apple : టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఇండియాలో రికార్డ్ స్థాయిలో విక్రయాలు నమోదు చేసింది. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా ఐఫోన్స్ అమ్ముడైపోయాయని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ తెలిపారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తూ యూజర్స్ ను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. గత ఏడాది ఎన్నో లేటెస్ట్ గాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసిన ఈ సంస్థ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. ముఖ్యంగా భారత్ లో ఎప్పుడూ లేనంతగా యాపిల్ అమ్మకాలు జరిపినట్లు తెలుస్తుంది. అక్టోబర్ – డిసెంబర్ నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రెండవ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా నిలిచిందని ఆ సంస్థ సీఈఓ టెమ్ కుక్ తెలిపారు.

Advertisement

ఇక మ్యాక్ బుక్స్, టాబ్లెట్లకు మూడో అతిపెద్ద మార్కెట్ గా యాపిల్ నిలిచిందని వెల్లడించారు. అయితే భారత్ లో అత్యధికంగా అమ్ముడైపోయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ నిలవటం ఇదే మొదటిసారి. కాగా భారత్ తో పాటు చైనా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం ఐఫోన్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని టిమ్ కుక్ తెలిపారు.

ఇక తాజాగా కౌంటర్ రీసెర్చ్ తెలిపిన సమాచారం ప్రకారం.. 2024లో యాపిల్ 23%, సామ్సంగ్ 22% మార్కెట్ వాటా సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. వివో 16%, ఒప్పో 14%, షావోమి 9% వాటాలతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.

Advertisement

ALSO READ :  ఇండియా సొంత ఏఐ.. మరో 6 నెలల్లో సాధ్యమే!

టక్ దిగ్గజం యాపిల్ ప్రస్తుతం భారత్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా యాపిల్ తన లేటెస్ట్ గాడ్జెట్స్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ ను ఇంగ్లీషుతో సహా మరిన్ని భాషలకు సపోర్ట్ చేసేలా త్వరలోనే తీసుకొస్తామని.. భారత్ లో ఉన్న అన్ని ముఖ్యమైన భాషల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా భారత్ ఎంటర్ప్రైజ్ విభాగం నుంచి యాపిల్ కు గట్టి డిమాండ్ ఉందని కూడా చెప్పుకువచ్చింది.

ఇక యాపిల్ కంపెనీ విక్రయాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో 2023 ఏప్రిల్ లోనే ముంబై, ఢిల్లీలో రెండు రిటైల్ స్టోర్లను యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ స్టోర్స్ కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో త్వరలోనే బెంగుళూరు, ఢిల్లీ ఎన్సీఈఆర్, బెంగుళూరు, ముంబైలో మరిన్ని స్టోర్లను తీసుకురానున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.

ఇక ఈ ఏడాది యాపిల్ 20 టాప్ గాడ్జెట్స్ ను తీసుకురాటానికి సిద్ధమవుతుంది. ఎంతో గ్రాండ్ గా ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో నాలుగు మొబైల్స్ రాబోతున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే యాపిల్ తీసుకురాబోతున్న ఐఫోన్ SE4 మొబైల్ సైతం రాబోతుంది. వీటితో పాటు ఐప్యాడ్, హోమ్ గ్యాడ్జెట్స్, ఎయిర్ పాడ్స్, స్మార్ట్ వాచెస్ సైతం రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ విక్రయాలు మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×