Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది అదరగొట్టాడు రెడీ అవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ చిన్నదానికి ఒక్క హిట్ వచ్చింది లేదు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో పూజాకు భారీ విజయం దక్కింది. ఈ సినిమా తరువాత పూజా చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు, తమిళ్, హిందీ .. ఇలా ఏ భాషలో చేసినా కూడా ఈ చిన్నదానికి హిట్ దక్కలేదు. బుట్టబొమ్మ గోల్డెన్ లెగ్ అన్నవారే.. ఐరన్ లెగ్ అని ట్రోల్ చేశారు.
రాధే శ్యామ్ , బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీకా భాయ్ కిసీకి జాన్, .. ఒకటి కాదు 5 సినిమాలు పూజా కెరీర్ లో ప్లాప్స్ గా నిలిచాయి. ఇక ప్లాప్స్ వచ్చాయని పూజా నిరుత్సాహపడలేదు. ఇండస్ట్రీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వెకేషన్ మోడ్ లోకి వెళ్ళింది. కుటుంబంతో కలిసి తగినంత సమయాన్ని గడిపింది. కొత్తగా 2025 ను స్టార్ట్ చేసింది. రెట్టింపు కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించింది. ఈ ఏడాది పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా నేడు రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంటుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది. అయితే ఈ సినిమాలో పూజా.. షాహిద్ కు ఘాటు లిప్ కిస్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sridevi Vijay Kumar: ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్.. ఆ అందం ఏంట్రా బాబు.. అప్సరసే
సాధారణంగా బాలీవుడ్ సినిమా అంటే హీరోయిన్స్ అందాల ఆరబోత, లిప్ కిస్ లు లేకుండా ఉండవు. కానీ, మొదటిసారి పూజా హెగ్డే ఇంత ఘాటుగా లిప్ కిస్ సీన్స్ చేయడం. దీంతో అమ్మడు ఈ లిప్ కిస్ వలన మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దేవా సినిమా చూసినవారందరూ.. ఇదంతా షాహిద్ వన్ మ్యాన్ షో అని, ఇందులో పూజా పాత్రకు అంత ఎలివేషన్ లేదని.. కేవలం సాంగ్, లిప్ కిస్ కోసమే హీరోయిన్ ను ఉంచారని చెప్పుకొస్తున్నారు.
కథ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్ ఒప్పుకుంటామని చెప్పుకొస్తున్న హీరోయిన్స్.. బాలీవుడ్ లో ఎలాంటి డిమాండ్ లేకుండానే ఇంటిమేటెడ్ సీన్స్ కు, ముద్దు సన్నివేశాలకు సై అంటున్నారు. అందుకు కారణం ఎక్కడ ఇలాంటివాటికి నో చెప్తే మళ్లీ ఛాన్స్ లు ఇవ్వరేమో అని.. ఒక్క పూజానే కాదు. టాలీవుడ్ నుంచి వెళ్లిన హీరోయిన్స్ లో సగం మంది బాలీవుడ్ కు వెళ్ళాక అయితే అందాల ఆరబోత చేసాయడం.. లేదా ఇంటిమేటెడ్ సీన్స్ కు ఒకే చెప్పడం చేసినవారే. మరి పూజాకు దేవా సినిమా ఎలా కలిసివస్తుందో చూడాలి.
Intense 🥵#PoojaHegde pic.twitter.com/q2ErEKcHE5
— Kajalmyqueen (@unknownguyitis) January 31, 2025