Hyderabad News: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. అన్నెం పుణ్యం ఎరుగని బాలికలను బలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి చదువున్న ముగ్గురు బాలికలను లొంగదీసుకున్నారు ముగ్గురు యువకులు. ఆ తర్వాత టూర్ పేరుతో బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అసలేం జరిగింది?
హైదరాబాద్ శివారు ప్రాంతం అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఈనెల 20న బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి బయటకు వెళ్లారు ముగ్గురు బాలికలు. జీహెచ్‌ఎంసీలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నాడు 19 ఏళ్ల గండికోట్ మధు. ముగ్గురు బాలికలతో పరిచయం పెంచకున్నాడు. దాన్ని ఫ్రెండ్ షిప్‌గా మార్చుకున్నాడు.
మధుకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వారాసిగూడకు చెందిన వంశీ అరవింద్, అతడి బంధువు నీరజ్. వీరి వయస్సు కేవలం 20 నుంచి 22 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే మధు.. బాలికలకు మాయమాటలు చెప్పాడు. అందరూ కలిసి హోటల్‌లో భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా బాలికలకు వీరిపై నమ్మకం కలిగింది. దాని వెనుక లోగుట్టును వీరి అర్థం చేసుకోలేకపోయారు.
బయటకు వెళ్దామని చెప్పి శనివారం బాలికలను బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు ముగ్గురు యువకులు. లాడ్జిలో మూడు గదులు తీసుకుని బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు ఈ కామాంధులు. ఆదివారం తార్నాకకు తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్లిపోయారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఏమైనా జరుగుతుందని తొలుత భయపడ్డారు.
ALSO READ: హైదరాబాద్ లో బౌన్సర్లను చితకబాదిన కస్టమర్లు
తమ జరిగిన దారుణం గురించి పేరెంట్స్ కు చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు బాలికల పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. బాధిత మైనర్లకు కౌన్సెలింగ్ ఇప్పించారు. వైద్య పరీక్షలు చేయగా అత్యాచారం జరిగినట్లు తేలింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే యాదగిరిగుట్టలో గది అద్దెకు ఇచ్చిన సోమేశ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త.