Google Gemini Veo Photos Videos | గూగుల్ జెమినీ అనే ఏఐ టూల్ (కృత్రిమ మేధస్సు సాధనం) కొత్త ఫీచర్‌తో మన ముందుకు వచ్చింది. ఇది మీ ఫోటోలను 8 సెకన్ల వీడియోలుగా మార్చగలదు. అందులో సౌండ్ కూడా ఉంటుంది! ఈ సాంకేతికత వీయో 3 అనే వీడియో జనరేషన్ మోడల్‌తో పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు భారతదేశంతో సహా కొన్ని ప్రాంతాల్లో జెమినీ అడ్వాన్స్‌డ్ అల్ట్రా, ప్రో సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ సౌకర్యం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కానీ గూగుల్ త్వరలో మొబైల్ యాప్‌లలో కూడా దీన్ని అందిస్తామని చెప్పింది. ఈ ఫీచర్ ద్వారా, మీరు ఒక ఫోటోను అప్‌లోడ్ చేసి, దానిలో ఏ విధమైన కదలికలు కావాలో వివరిస్తూ ప్రాంప్ట్ ఇస్తే చాలు. అలాగే, సౌండ్ ఎఫెక్ట్స్, సంభాషణలు లేదా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను కూడా జోడించవచ్చు. ఆ తర్వాత, జెమినీ 720p నాణ్యత గల ఒక MP4 వీడియోను 16:9 ఫార్మాట్‌లో తయారు చేస్తుంది.
గూగుల్‌లోని జెమినీ యాప్, గూగుల్ లాబ్స్ వైస్ ప్రెసిడెంట్ జోష్ వుడ్‌వార్డ్.. ఈ ఫీచర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రదర్శించారు. ఒక చిన్నారి గీసిన చిత్రాన్ని జెమిని వియోలోని ఈ ఫీచర్ ద్వారా 8 సెకన్ల వీడియోగా మార్చి, అందులో సౌండ్ కూడా జోడించారు. “ఇది ఇంకా ప్రయోగాత్మకంగా ఉంది, కానీ జెమిని ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లు మొదట దీన్ని ప్రయత్నించాలని మేము కోరుతున్నాము. కిండర్‌గార్టెన్ చిత్రాలను.. సౌండ్‌తో కూడిన వీడియోలుగా మార్చడం చాలా సరదాగా ఉంది!” అని ఆయన రాశారు.
ఈ వీడియోలు AI ద్వారా తయారు చేసినవని స్పష్టం చేయడానికి, ప్రతి వీడియో కుడివైపు బాటం కార్నర్‌లో “వీయో” అనే వాటర్‌మార్క్ కనిపిస్తుంది. అలాగే, గూగుల్ డీప్‌మైండ్ సృష్టించిన సింథ్‌ఐడీ అనే అదృశ్య డిజిటల్ వాటర్‌మార్క్ కూడా జోడించబడుతుంది. ఈ వాటర్‌మార్క్ AI ద్వారా తయారైన కంటెంట్‌ను గుర్తించడానికి సహాయపడుతుంది.
గూగుల్ జెమిని వియోలో ఫోటోను వీడియోగా ఎలా మార్చాలి?..
జెమినీ వెబ్‌సైట్‌లో “టూల్స్” ఐకాన్‌పై క్లిక్ చేయండి.
జాబితా నుండి “వీడియో” టూల్‌ను ఎంచుకోండి.
మీరు వీడియోగా మార్చాలనుకున్న ఫోటోను అప్‌లోడ్ చేయండి.
ఫోటోలో ఏ కదలికలు కావాలో వివరణ రాయండి.
సౌండ్ ఎఫెక్ట్స్, సంభాషణలు లేదా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను యాడ్ చేయండి. (ఇది ఆప్షనల్).
జెమినీ 720p నాణ్యత గల MP4 వీడియోను 16:9 ఫార్మాట్‌లో తయారు చేస్తుంది.
వీడియోలో సౌండ్ ఆటోమెటిక్‌గా చిత్రాలతో సింక్ అవుతుంది.
గూగుల్ వీయో 3 గురించి:
గూగుల్ I/O ఈవెంట్‌లో మొదటిసారి లాంచ్ అయిన వీయో 3, గూగుల్ అత్యంత అడ్వాన్స్ వీడియో మోడల్. ఇది టెక్స్ట్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌ల ఆధారంగా వాస్తవిక వీడియోలను, సౌండ్‌ను తయారు చేయగలదు. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. “వీయో 3 టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్‌ల నుండి వాస్తవిక వీడియోలను, సింక్ సౌండ్‌తో తయారు చేయడంలో గొప్పగా పనిచేస్తుంది. మీరు చిన్న కథను ప్రాంప్ట్‌గా రాస్తే, అది దాన్ని వీడియోగా మార్చి, జీవం పోస్తుంది.”
Also Read: మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు .. ఎప్పటినుంచి అంటే?
ఈ ఫీచర్ ద్వారా, మీ జ్ఞాపకాలను, ఆలోచనల్లో క్రియేటివిటీ మరింత ఆసక్తికరంగా, జీవంతో చూడవచ్చు. ఒక సాధారణ ఫోటోను వీడియోగా మార్చి, అందులో సౌండ్ జోడించడం ద్వారా, మీ కథను మరింత ఆకర్షణీయంగా చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ క్రియేటివిటీని మరో స్థాయికి తీసుకెళ్తోంది!