Indian Railway App: దేశ వ్యాప్తంగా రోజూ సుమారు 2.5 కోట్ల మందికి పైగా రైలు ప్రయాణాలు చేస్తున్నారు. సుమారు 12 వేలకు పైగా రైళ్ల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ‘రైల్ వన్’ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఒక్కో రైల్వే సేవకు ఒక్కో రైల్వే యాప్ అందుబాటులో ఉండగా, అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ‘రైల్ వన్’ను రూపొందించింది. రీసెంట్ గానే ఈ యాప్ ప్రయాణీకులకు ముందుకు తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వార టికెట్లు బుక్ చేసుకోవడం, PNR స్టేటస్ చెక్ చేసుకోవడం, రైలు కరెంట్ స్టేటస్ తెలుసుకోవడం, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఫిర్యాదులు చేయడం సహా అన్నింటికి సింగిల్ సొల్యూషన్ గా ఈ యాప్ ఉపయోగపడనుంది. ఈ యాప్ సేవలు పొందాలంటే IRCTC అకౌంట్ ను రైల్ వన్ యాప్ కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ లింక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
IRCTC అకౌంట్ ను రైల్ వన్ యాప్ తో ఎలా లింక్ చేయాలంటే?
⦿ ముందుగా యాప్ స్టోర్ నుంచి రైల్ వన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
⦿ యాప్ ఓపెన్ చేసి ముందుగా సైన్ అప్ కావాలి. లేదంటే ఇంతకు ముందే ఉన్న అకౌంట్ తో లాగిన్ కావాలి.
⦿ యాప్ హోమ్ పేజీలో IRCTC లింక్ మీద క్లిక్ చేయాలి.
⦿ మీ IRCTC యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
⦿ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
⦿ OTP ఎంటర్ చేసిన తర్వాత IRCTC అకౌంట్ రైల్ వన్ యాప్ తో లింక్ సక్సెస్ ఫుల్ గా అవుతుంది.
⦿ IRCTC అకౌంట్ రైల్ వన్ యాప్ తో లింక్ కాగానే, మళ్లీ లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా రైల్వే సేవలను పొందే అవకాశం ఉంటుంది.
రైల్ వన్ తో లింక్ చేయడం వల్ల కలిగే లాభాలు
ఒకసారి IRCTC అకౌంట్ ను రైల్ వన్ యాప్ కు లింక్ చేయడం వల్ల ప్రతిసారి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సేవలను ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. బుకింగ్ హిస్టరీ, టికెట్, రైలు షెడ్యూల్, కరెంట్ స్టేటస్ లాంటి అన్ని సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా వేగవంతమైన సేవలు పొందే అవకాశం ఉంటుంది. రైలు ఆలస్యం, ప్లాట్ ఫాం మార్పులు సహా ఇతర లేటెస్ట్ సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రైల్ వన్ యాన్ ఈజీగా అర్థమయ్యే ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది.
Read Also: తిరుపతికి మరో వందేభారత్, జస్ట్ నాలుగు గంటల్లోనే..