BigTV English

Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో ఆఫీస్ డెస్కులు.. ఎవరికి వచ్చిందో ఈ విచిత్రమైన ఆలోచన

Swimming Pool: స్విమ్మింగ్ పూల్‌లో ఆఫీస్ డెస్కులు.. ఎవరికి వచ్చిందో ఈ విచిత్రమైన ఆలోచన

కార్యాలయం అందంగా, ఆహ్లాదంగా ఉంటేనే ఉద్యోగులు కూడా ఉత్సాహంతో పనిచేయగలరు. ఆఫీసు కూడా సృజనాత్మకంగా ఉండాలని ఎన్నో అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. అప్పుడే ఉద్యోగుల ప్రోడక్టివిటీ కూడా పెరుగుతుందని అంటారు. అందుకే ఇప్పుడు ఆఫీసులకు కొత్త రూపాలను అందిస్తున్నారు. కొందరు కంపెనీల పైకప్పులపై తోటలు పెంచడం, బస్సులనే కార్యాలయాలుగా మార్చడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక చైనా కంపెనీ మరింత సృజనాత్మకంగా ఆలోచించింది.


స్విమ్మింగ్ పూల్ ఆఫీసు
ఆ చైనా కంపెనీ పేరు చెంగ్డు సిచువాన్ ప్రావిన్స్ లో ఉన్న చెంగ్డులో ఉద్యోగులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా, కొత్తగా ఉండేలా డెస్కుని ఏర్పాటు చేయాలని భావించింది. దీనికోసం ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోనే డెస్కులను కట్టేసింది. అయితే ఆ స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు నిండుగా లేవు. నీటిని మొత్తం తోడేసి చాలా తక్కువ మొత్తంలో ఉంచారు.  ఆ తర్వాత అందులో డెస్కులను ఏర్పాటు చేసింది. అందులోకి దిగేందుకు మెట్ల దారిని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ లో డెస్కులు ఉన్న ఆఫీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్విమ్మింగ్ పూల్‌ను ఆఫీసు స్పేస్ గా ఉపయోగించుకున్న కంపెనీ అని చైనాలో చెంగ్డుకు ఎంతో పేరు వచ్చింది. ఆన్‌లైన్ లో ఈ స్విమ్మింగ్ పూల్ ఆఫీసును చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్విమ్మింగ్ ఫూల్ 1.55 మీటర్ల లోతు ఉంటుంది. చుట్టూ నీలం గోడలతో చూసేందుకు కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో ఐదు వరసల్లో డెస్కులను ఏర్పాటు చేసి 8 వర్క్ స్టేషన్లను పెట్టారు. అలాగే ఆఫీస్ కు అవసరమైన కంప్యూటర్లు, పవర్ కేబుళ్లు…అన్నిటిని ఏర్పాటు చేశారు. ఎక్స్ టెన్షన్ తీగలు, సాకెట్లు చక్కగా సెటప్ చేశారు. అయితే ఈ సెటప్ తాతాలికమైనదేనని అంటోంది ఆ కంపెనీ. ఏది ఏమైనా స్విమ్మింగ్ పూల్ ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని ఆ ఆఫీసులో ఎవరికి ఈ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఆ క్రియేటివిటీకి మాత్రం హాట్సాఫ్ చెప్పాల్సిందే.


ఆఫీసుల్లో వాడకుండా వదిలేసిన జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటిని ఇలా ఆఫీసు డెస్కులుగా ఉపయోగించుకుంటే బోలెడంత స్పేస్ కలిసి వస్తుందని వ్యాఖ్యానించే వారు కూడా ఉన్నారు.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×