E-Paper
Advertisement

Fake Hotel Booking: ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ చేస్తున్నారా? నకిలీ వెబ్‌సైట్లతో దోపిడీ.. ఎలా చేస్తున్నారంటే

Fake Hotel Booking: ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ చేస్తున్నారా? నకిలీ వెబ్‌సైట్లతో దోపిడీ.. ఎలా చేస్తున్నారంటే
Advertisement

Fake Hotel Booking Website Scam| ప్రయాణికులు ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఫేక్ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్ల ద్వారా జరిగే పెద్ద సైబర్ మోసాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. ఈ నకిలీ వెబ్‌సైట్‌ని నడిపే ప్రధాన నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఒక పాపులర్ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌లా నటిస్తూ ప్రయాణికులను దోచుకునేవాడు. ఒక అమెరికా పౌరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు.

మోసం ఎలా చేస్తారంటే..

సైబర్ నేరగాళ్లు ప్రయాణికులను దోచుకోవడానికి సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ ఉపయోగించారు. ముందుగా ఒక నకిలీ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి.. అందులో హోటల్ రూమ్ బుకింగ్ సిస్టమ్ ను పోలిన వ్యవస్థ నిర్మించారు. అమాయక ప్రయాణికులు అందులో బుకింగ్ చేసి పేమెంట్ చేశారు. కానీ ఆ తరువాత హోటల్ కు వెళ్లగా అక్కడ వారి బుకింగ్ ఉండదు. ఆ తరువాత కూడా నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ ఆన్ లైన్ లో చూపుతారు. ఆ నెంబర్ కు ఎవరైనా కాల్ చేయగా.. నకిలీ ఏజెంట్ గా బుకాయిస్తూ సైబర్ దొంగలు మళ్లీ వారి బ్యాంకు వివరాలు తీసుకొని ఆ బ్యాంక్ మొత్తం ఖాళీ చేస్తారు.

Advertisement

ఉదాహరణకు ఆ అమెరికన్ బాధితుడి బుక్ చేసుకన్న హోటల్ రూమ్ బుకింగ్ వెబ్‌సైట్ నకిలీది. అతను కస్టమర్ కేర్ కు ఫోన్ చేయగా.. పోలీసులు అరెస్ట్ నిందితుడు తాను నిజంగా ఒక ట్రావెల్ ప్లాట్‌ఫామ్ కస్టమర్ కేర్ ఏజెంట్ అని అమెరికన్ ప్రయాణికుడిని నమ్మించాడు. బుకింగ్ కన్ఫర్మేషన్ లేదా రిఫండ్ సాయం చేస్తున్నట్టు నిందితుడు నటించాడు. ఇదంతా ఆన్ లైన్ చాటింగ్, కాల్స్ ద్వారానే జరిగింది. కాల్‌లో OTP, UPI వివరాలు అడిగాడు.

ఆ అమెరికాన్ బాధితుడు ఆ సైబర్ దొంగ పూర్తిగా నమ్మేశాడు. అందుకే అడిగిన వెంటనే OTP, UPI వివరాలు షేర్ చేశారు. ఆ వెంటనే ఆ దొంగ ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు చేసి అమెరికన్ అకౌంట్ లోని డబ్బు దొంగిలించాడు. అర్జెంట్ ట్రావెల్ ప్లాన్ చేసేవాళ్లను టార్గెట్ చేశాడు.

బాధితుడు ఎంత నష్టపోయాడు?

Advertisement

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అమెరికన్ బాధితుడు రూ.57,186 కోల్పోయాడు. అనధికార డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బు దొంగిలించారు. నిందితుడు ఆ డబ్బుతో తన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టాడు. అదే అతను చేసిన తప్పు. పోలీసులు అతని ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ట్రాక్ చేసి మోసాగాడి అడ్రస్‌ని కనిపెట్టారు.

పోలీస్ రైడ్స్‌లో ఏం దొరికింది?

ఢిల్లీ పోలీసులు నిందితుడి లొకేషన్స్‌ పై రైడ్స్ చేశారు. మోసం చేయడానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్స్, ఫేక్ ఆధార్ కార్డు సీజ్ చేశారు. వాట్సాప్ చాట్స్ ద్వారా బాధితులని మోసం చేసిన ఆధారాలు దొరికాయి. సీజ్ చేసిన 29 ఫోన్ నంబర్లు.. సైబర్ క్రైమ్ ఫిర్యాదులతో మ్యాచ్ అయ్యాయి.

నిందితుడు ఎవరు?

నిందితుడు 26 ఏళ్ల ప్రతోష్ కుమార్. బిహార్ షేక్‌పురా జిల్లాకి చెందినవాడు. 12వ తరగతి (ఇంటర్మిడీయట్) వరకు చదువుకున్నాడు. ఆరు ఏళ్లుగా సైబర్ మోసాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్ట్ తర్వాత నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.. మల్టిపుల్ ఫోన్స్, ఫేక్ ఐడెంటిటీలు ఉపయోగించి ఆన్‌లైన్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ స్టాఫ్‌లా నటించి మోసం చేశాడు.

Also Read: నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, దొంగ యుపిఐ ఐడీలు.. సైబర్ దొంగలను ఇలా గుర్తుపట్టండి

సోషల్ ఇంజినీరింగ్ ఎలా ఉపయోగించాడు

బాధితులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేసేవాడు. అర్జెన్సీ క్రియేట్ చేసి OTP, UPI వివరాలు అడిగేవాడు. అందుకే ఎవరికీ OTP, పేమెంట్ వివరాలు షేర్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధికారిక యాప్స్, వెరిఫైడ్ వెబ్‌సైట్స్ ద్వారానే హెటల్ బుకింగ్ చేయాలి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×