E-Paper
Advertisement

PV Sunil kumar: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?

PV Sunil kumar: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?
Advertisement

PV Sunil kumar: ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ పేరు చెప్పగానే ముందుగా రఘురామ కృష్ణంరాజు గుర్తుకొస్తారు. ఆయనపై రాజద్రోహం కేసులో సీఐడీ కస్టడీలో చిత్రహంసలకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రెండురోజుల ముందు ఆయన గుంటూరు పోలీసుల ముందు హాజరయ్యారు. దాదాపు నాలుగైదు గంటలపాటు ఆయన్ని పోలీసులు విచారించారు.

IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు

Advertisement

అధికారులు ఏ తరహా ప్రశ్నలు అడిగినా, తెలియదు, గుర్తులేదు అనే సమాధానంగా ఎక్కువగా వచ్చినట్టు చెప్పారట. విచారణకు హాజరైన ఆయన, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తి రేపుతోంది.  దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారు.. మంచిదే, మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా? CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించారని, చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలన్నది ఆ పోస్టు సారాంశం.

ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌ సస్పెండ్ వెనుక అసలు కారణాలు చూద్దాం. అనుమతి లేకుండా పలుమార్లు  ఆయన విదేశీ పర్యటనలు చేయడమే అందుకు కారణం. నిబంధనలు ఉల్లంఘించడంతో విధులకు ఆయన్ని దూరంగా పెట్టింది కూటమి ప్రభుత్వం.

Advertisement

ఆయన మాటేంటి? సమ న్యాయం కోసం

ఇక డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజుకు వ్యవహారానికి వద్దాం. ఆయనకు ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్ భారత్ సంస్ధ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కేసులో స్టే ఎత్తివేసింది. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని చెప్పింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ ధర్మల్ పవర్ సంస్థ పేరుతో రుణాలు తీసుకుని, వాటిని పక్కకు మళ్లించడం, వడ్డీ చెల్లించలేదని ఆ బ్యాంకు సీబీఐని ఆశ్రయించింది. అందులో రకరకాల అంశాలను ప్రస్తావించిన విషయం తెల్సిందే. ఆ కేసు నేపథ్యంలో పీవీ సునీల్‌కుమార్ ఈ విధంగా ఎక్స్‌లో పోస్టు పెట్టినట్టు చెబుతున్నారు.

ALSO READ:  గజ గజ వణుకుతున్న జనం..  మరో రెండురోజులు తప్పదా?

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×