E-Paper
Advertisement

Ind W vs SL W: విశాఖలో పొగమంచు… టీమిండియా విమానం డైవర్ట్ !

Ind W vs SL W: విశాఖలో పొగమంచు… టీమిండియా విమానం డైవర్ట్ !
Advertisement

Ind W vs SL W: ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఈనెల 21 నుండి శ్రీలంకతో ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ కి సిద్ధమైంది. భారత మహిళల జట్టుకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన హర్మన్ ప్రీత్ కౌర్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. స్మృతి మందాన వైస్ కెప్టెన్ గా కొనసాగుతుంది.

Also Read: Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. స‌ర్ఫ‌రాజ్ పోస్ట్ వైర‌ల్

Advertisement

ఇక సీనియర్లతోపాటు అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన జి. కమలిని వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చింది. అలాగే బౌలర్ వైష్ణవి శర్మ కూడా ఈ సిరీస్ కి ఎంపికైంది. భారత్ – శ్రీలంక మహిళల జట్ల మధ్య మొత్తం 5 టి-20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ డిసెంబర్ 21న ప్రారంభమై.. డిసెంబర్ 30న ముగుస్తుంది. విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

 

విశాఖలో పొగ మంచు.. టీమిండియా విమానం డైవర్ట్:

Advertisement

శ్రీలంకతో 5 టి 20 మ్యాచ్ ల సిరీస్ కోసం భారత జట్టు నేడు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఉమెన్స్ టి-20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయలుదేరిన విమానాన్ని పూర్ విజిబులిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్ళించారు. అలాగే దేశవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయానికి గురవుతున్నాయి. విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగ మంచు కారణంగా రద్దయింది. భారత్ – శ్రీలంక మధ్య మొదటి టి-20 డిసెంబర్ 21 ఆదివారం రోజున విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం విశాఖపట్నం బయలుదేరిన భారత మహిళా జట్టు ప్రస్తుతం విజయవాడ చేరుకుంది.

 

టి-20 ప్రపంచ కప్ 2026:

ఈ ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్.. టి-20 ప్రపంచ కప్ 2026 కి మొదటి సన్నాహకంగా భావిస్తున్నారు. 2024 లో జరిగిన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ ని 2-1, ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ ని 3 – 2 తో కైవసం చేసుకుంది.

Also Read: Jasprit Bumrah: బుమ్రా ఫ్యామిలీకి ఏమైంది.. టీ20 సిరీస్ మధ్యలో ఎందుకు ముంబై వెళ్లారు?

టి-20 ప్రపంచ కప్ 2026 కి ముందు టీమిండియా – ఆస్ట్రేలియా 2026 ఫిబ్రవరిలో, 2026 మే లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. అలాగే వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇక భారత్ – శ్రీలంక చివరి టి-20 మ్యాచ్ అక్టోబర్ 2024లో ప్రపంచ కప్ సందర్భంగా ఆడాయి. డిసెంబర్ లో జరగాల్సిన భారత్ – బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడిన తర్వాత.. శ్రీలంకతో ఈ ద్వైపాక్షిక సిరీస్ ని ఖరారు చేశారు.

Related News

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

Big Stories

Advertisement
×