AI security threats 2026: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కంపెనీ, ప్రతి వ్యాపారం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడుతున్నాయి. చాట్ బాట్‌లు, ఆటో మేషన్ టూల్స్, కోడింగ్ అసిస్టెంట్లు ఇలా ప్రతి చోటా ఏఐ రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రిమినల్స్ కూడా తమ పద్ధతులను.. అప్‌గ్రేడ్ చేసుకున్నారు. పాత కాలపు డేటా బ్రీచ్‌ల పద్ధతులు వదిలేసి.. నేరుగా ఏఐ మోడల్స్‌ను కంట్రోల్ చేసే.. ‘API కీస్’, ‘యాక్సెస్ టోకెన్స్’ను టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక కంపెనీ డేటాను.. హ్యాక్ చేస్తే ఆ సమాచారం ఒక్క దానితోనే సరి పోతుంది. కానీ.. ఆ ఏఐ సిస్టమ్‌ను రన్ చేసే ‘కీస్ కనుక హ్యాకర్ల చేతికి చిక్కితే.. వారు ఆ కంపెనీకి సంబంధించిన మొత్తం ఏఐ సామ్రాజ్యాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. అంటే.. ఆ ఏఐ మోడల్‌ను తప్పు దారి పట్టించడం, సున్నితమైన బిజినెస్ సీక్రెట్స్‌ను రాబట్టడం, లేదా ఆ ఏఐ టూల్స్‌ను దుర్వినియోగం చేయడం వంటి ప్రమాదకరమైన పనులకు పాల్పడతారు. అందుకే.. హ్యాకర్లు ఇప్పుడు డేటా కంటే ఈ ‘డిజిటల్ కీ’ కోసమే ఎగబడుతున్నారు.
ఈ సైబర్ దాడులు.. చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. డెవలపర్లు పొరపాటున పబ్లిక్ రిపోజిటరీలలో (GitHub లాంటి వాటిలో) వదిలేసే.. ఏఐ API కీస్‌ను హ్యాకర్లు ఆటో మేటెడ్ బాట్స్ ద్వారా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఒక సారి ఈ కీస్ దొరికితే చాలు, వారు ఆ కంపెనీ ఏఐ అకౌంట్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తారు. పైగా.. ఈ దాడులు చాలా వరకు బయటపడవు. ఎందుకంటే.. సిస్టమ్ నార్మల్‌గా పని చేస్తున్నట్లే ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్‌లో మాత్రం కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఈ రకమైన దాడుల వల్ల కంపెనీలకు తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయి.
ఆర్థిక నష్టం: హ్యాకర్లు ఆ ఏఐ కీస్‌ను వాడుకొని భారీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై ఖరీ దైన ప్రాసెసింగ్ రిక్వెస్ట్‌లు రన్ చేస్తూ..బాధితుల క్రెడిట్ బ్యాలెన్స్‌ను ఖాళీ చేసే స్తారు.
ప్రైవసీ ప్రాబ్లమ్స్: ఏఐ సిస్టమ్‌లో.. యూజర్లు ఇన్ పుట్ ఇచ్చే పర్సనల్ ,కార్పొరేట్ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది.
బ్రాండ్ వాల్యూ డౌన్: ఏఐ సిస్టమ్ హ్యాక్ అయిందని తెలిస్తే.. ఆ కంపెనీపై కస్టమర్లకు నమ్మకం సడలి పోతుంది.
Also Read: ల్యాప్ ట్యాప్ స్లో అయిందా? ఈ ఒక్క మ్యాజిక్ ట్రిక్‌తో క్షణాల్లో ఫైల్స్ అన్నీ సెట్!
ఈ సరి కొత్త ముప్పును ఎదుర్కొనేందుకు.. టెక్ కంపెనీలు కఠినమైన భద్రతా చర్యలు పాటించాల్సిందే. డెవలపర్లు ఎప్పుడూ.. కూడా ఏఐ కీస్‌ను పబ్లిక్ కోడ్‌లో డైరెక్ట్‌గా పెట్టకూడదు. ఎన్విరాన్‌మెంట్ వేరియబుల్స్ వాడాలి. అలాగే ఎప్పటికప్పుడు యాక్సెస్ టోకెన్స్‌ను మారుస్తూ ఉండాలి. మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా అనధికారిక యాక్సెస్‌ను అడ్డు కోవచ్చు.
సైబర్ నేరగాళ్లు డిజిటల్ .. ప్రపంచంలో టెక్నిక్స్ మారుస్తున్నారు. డేటా చోరీ నుంచి నేరుగా ఏఐ సిస్టమ్స్ కంట్రోల్ రూమ్‌లోకి చొరబడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ టెక్ ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. కంపెనీలు తమ ఏఐ సెక్యూరిటీని.. మరింత బలోపేతం చేసుకుంటేనే.. ఇలాంటి ప్రమాదాల నుంచి ఈజీగా బయట పడగలవు!