E-Paper
Advertisement

చూడటానికి అల్ట్రా రిచ్.. పనిలో సూపర్ ఫాస్ట్! ట్రెండింగ్‌లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు !

చూడటానికి అల్ట్రా రిచ్.. పనిలో సూపర్ ఫాస్ట్! ట్రెండింగ్‌లో బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు !
Advertisement

Premium Double Door Fridge: మన లైఫ్‌స్టైల్ మారినట్టే.. మన వంటింటి గాడ్జెట్లు కూడా నెక్స్ట్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అయిపోతున్నాయి. అందులోనూ రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మారింది. ఉరుకులు పరుగుల బిజీ లైఫ్‌లో రోజూ మార్కెట్‌కి వెళ్లి తాజా కూరగాయలు తెచ్చుకోవడం కష్టమైన పని? అందుకే వీకెండ్‌లోనే వారం సరి పడా తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం. కానీ.. సాధారణ ఫ్రిడ్జ్‌లలో పెడితే రెండ్రోజులకే కూరగాయలు వాడిపోయి రంగు మారిపోతుంటాయి. ఈ తలనొప్పులన్నింటికీ చెక్ పెట్టడానికే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి ఈ ‘ప్రీమియం డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు’!

సూపర్ ఫాస్ట్ కూలింగ్:

సాధారణ ఫ్రిడ్జ్‌లతో పోలిస్తే.. ప్రీమియం మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీ వాడతారు. మల్టిపుల్ ఎయిర్ వెంట్స్ ద్వారా ఫ్రిడ్జ్ మూలమూలకు ఒకేలా చల్లటి గాలి పాస్ అవుతుంది. అంటే మీరు ఎక్కడ పెట్టినా సరే, పదార్థాలు సూపర్ ఫ్రెష్‌గా కూల్ అవుతాయి. ఇక ఐస్ కావాలంటే.. గంటల తరబడి వెయిట్ చేసే రోజులు పోయాయి! ఇందులో ఉండే ఫాస్ట్ ఐస్ మేకింగ్ ఫీచర్ పుణ్యమా అని.. క్షణాల్లోనే ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి. సమ్మర్ వచ్చిందంటే చాలు, ఈ ఫీచర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు!

రోజుల తరబడి అసలైన తాజాదనం:

Advertisement

కొన్న కూరగాయలు, పండ్లు పది రోజులు గడిచినా అచ్చం నిన్న తెచ్చినట్లే తాజాగా ఉండటం ఈ ఫ్రిడ్జ్ అసలైన హైలైట్. ఇందులో ఉండే స్పెషల్ మాయిశ్చర్ కంట్రోల్ జోన్స్, యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్స్ ఆహారంపై బ్యాక్టీరియా అటాక్ కాకుండా కాపాడతాయి. ఆకుకూరలు వాడిపోవడం, పండ్లు కుళ్ళిపోవడం లాంటి టెన్షన్లే ఉండవు. పిల్లలకు ఇష్టమైన పాలు, పెరుగు, జ్యూసులు కూడా రోజుల తరబడి చెడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.

ఇన్వర్టర్ టెక్నాలజీ:

పెద్ద ఫ్రిడ్జ్ ఇంట్లో పెడితే.. కరెంట్ బిల్లు  ఎక్కువగా వస్తుందని  చాలామంది భయపడుతుంటారు. బట్, డోంట్ వర్రీ! ఈ ప్రీమియం డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు అన్నీ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తున్నాయి. అంటే ..ఇంటి ఉష్ణోగ్రత , లోపల ఉన్న ఫుడ్ లోడ్‌ను బట్టి ఇది ఆటోమేటిక్‌గా తన స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండా చాలా వరకు ఆదా అవుతుంది. పైగా.. ఇది నడుస్తున్న శబ్దమే రాకుండా ఎంతో సైలెంట్‌గా పని చేస్తుంది. వోల్టేజ్ మారినా స్టెబిలైజర్ లేకపోయినా హ్యాపీగా రన్ అవుతుంది.

ప్రీమియం లుక్స్ & మాసివ్ స్పేస్:

Advertisement

ఇంట్లో జనం పెరిగితే.. ఫ్రిడ్జ్ లోపల సామాను సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్. కానీ.. ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లలో వైడ్ స్పేస్, టెంపర్డ్ గ్లాస్ షెల్వ్స్ ఉండటం వల్ల గిన్నెలు, పెద్ద బాటిళ్లు ఎంచక్కా సర్దుకోవచ్చు. ఇక దీని డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మెటాలిక్ ఫినిషింగ్, స్లీక్ లుక్ చూసేవాళ్ళను.. ఇన్‌స్టంట్‌గా అట్రాక్ట్ చేస్తాయి. మీ కిచెన్ ఇంటీరియర్‌కి ఇది ఒక పక్కా రాయల్ లుక్ ఇస్తుంది.

Also Read: కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

మెయింటెనెన్స్ వెరీ ఈజీ!

ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అంటేనే.. పెద్ద పని అనుకుంటారు చాలా మంది. కానీ.. ఈ ప్రీమియం మోడల్స్‌లో ఉన్న ఇన్నర్ పార్ట్స్ చాలా ఈజీగా విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాదు, యాంటీ ఓడర్ ఫిల్టర్స్ ఉండటం వల్ల వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ వాసనలు మిక్స్ అయ్యి చెడు రాకుండా ఎప్పుడూ గుమగుమలాడుతూ తాజాగా ఉంటుంది.

ప్రీమియం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఖర్చు కాదు, మీ ఫ్యామిలీ హెల్త్ అండ్ కంఫర్ట్ కోసం చేసే అల్టిమేట్ ఇన్వెస్ట్‌మెంట్. ఫాస్ట్ కూలింగ్, లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్‌నెస్, కరెంట్ సేవింగ్.. అన్నీ ఒకే చోట దొరికే ఈ సూపర్ గాడ్జెట్‌తో మీ వంటింటికి కొత్త కళ తెచ్చేయండి!

Related News

ల్యాప్ ట్యాప్ స్లో అయిందా? ఈ ఒక్క మ్యాజిక్ ట్రిక్‌తో క్షణాల్లో ఫైల్స్ అన్నీ సెట్!

ఇంట్లోనే సినిమా థియేటర్ మజా.. అమెజాన్‌లో టాప్‌లో ఉన్న 5 బెస్ట్ ప్రాజెక్టర్ స్క్రీన్స్ ఇవే!

ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!

ఏసీని ఎలా ఆఫ్ చేయాలి? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

Big Stories

Advertisement
×