Best Home Projectors: ఇంట్లోనే కూర్చొని బిగ్ స్క్రీన్‌పై సినిమాలు చూస్తే.. ఆ అనుభూతే వేరు. అందుకే ఇప్పుడు చాలామంది హోమ్ థియేటర్ కోసం ప్రొజెక్టర్లను ఎంచుకుంటున్నారు. అయితే మంచి ప్రొజెక్టర్‌తో పాటు సరైన స్క్రీన్ కూడా ఉంటేనే సినిమా చూసే అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది. మీ బడ్జెట్, అవసరాలకు సరిపోయేలా మార్కెట్లో ఎన్నో రకాల ప్రొజెక్టర్ స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అమెజాన్‌లో మంచి ఆదరణ పొందుతున్న టాప్-5 ప్రొజెక్టర్ స్క్రీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకునేవారికి ఎండ్‌బెబ్రోన్ స్క్రీన్ సరైన ఎంపిక. దీని ధర సుమారు రూ.2,000 ఉంటుంది. 120 అంగుళాల సైజులో లభించే ఈ స్క్రీన్‌ను గోడకు తాడులు లేదా హుక్స్ సహాయంతో సులభంగా అంటించుకోవచ్చు. మడతపెట్టే వీలుండటంతో ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కూడా చాలా సులభం.
గోడలకు రంధ్రాలు చేయడం ఇష్టం లేనివారి కోసం టోవాండ్ బ్రాండ్ మంచి ఆప్షన్. దీని ధర సుమారు రూ.7,500 ఉంటుంది. స్టాండ్‌తో పాటు వచ్చే ఈ స్క్రీన్‌ను ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండేందుకు తాడులు, ఇసుక సంచులు కూడా ఇస్తారు. ఇది బయట పార్టీలకు, ట్రిప్‌లకు తీసుకువెళ్లడానికి పర్ఫెక్ట్.
Also Read: ల్యాప్‌టాప్, పీసీని ఎప్పుడైనా ఆల్కహాల్‌తో తుడిచారా? అలా చేసే ముందు ఇవి తెలుసుకోండి!
సినిమా ప్రేమికులకు సిల్వర్ టికెట్ బ్రాండ్ హై-ఎండ్ ఫ్రేమ్ స్క్రీన్ బాగా నచ్చుతుంది. దీని ధర దాదాపు రూ.23,000 ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో గట్టిగా ఉండే ఈ స్క్రీన్‌ను ఒక్కసారి అమర్చితే సరిపోతుంది. ముడతలు లేకుండా ఎప్పుడూ ఒకేలా స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. ఇంటిని మినీ థియేటర్‌లా మార్చుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్.
స్థలం తక్కువగా ఉండి, వాడిన తర్వాత ఎత్తిపెట్టాలనుకునేవారికి ఆక్సున్ మోటరైజ్డ్ స్క్రీన్ మంచిది. దీని ధర సుమారు రూ.12,000 ఉంటుంది. రిమోట్ లేదా బటన్ నొక్కగానే ఇది కిందకు వస్తుంది. పని అయిపోగానే పైకి చుట్టుకుపోతుంది. కిటికీల ముందు తగిలించినా వెలుతురు బయటకు రాకుండా చక్కగా పనిచేస్తుంది.
ఇంట్లో పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు లేదా స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి ఎక్స్‌హెచ్‌సీపీవై గాలి నింపే బిగ్ స్క్రీన్ బాగుంటుంది. దీని ధర సుమారు రూ.11,000 ఉంటుంది. ఏకంగా 20 అడుగుల సైజులో ఉండే ఈ స్క్రీన్ గాలి పంపు సహాయంతో నిమిషాల్లో సిద్ధమవుతుంది. వెనుక నుండి ప్రొజెక్ట్ చేసే సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత.
Also Read: ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?